మహేష్ బాబు తన ప్రతి సినిమా విడుదల అయిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్తాడు.కేవలం తాను మాత్రమే కాకుండా కుటుంబం మొత్తంను తీసుకుని విదేశాలకు హాలీడే ట్రిప్ వేస్తాడు.
సర్కారు వారి పాట సినిమా తర్వాత కూడా హాలీ డే ట్రిప్ ఉందంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.అన్నట్లుగానే సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన వెంటనే విదేశాలకు మహేష్ బాబు సిద్దం అయ్యాడు.
వచ్చే సోమవారం లేదా మంగళ వారం మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లబోతున్నాడు.విషయం ను ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.
సాదారణంగా విదేశీ పర్యటన అంటే మినిమంగా రెండు నుండి నాలుగు వారాల పాటు మహేష్ బాబు తీసుకుంటాడు.కనుక ఆయన ఈసారి కూడా జూన్ నెల వరకు అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయంటూ అంతా భావిస్తున్నారు.
అయితే జూన్ లో త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉండగా మహేష్ బాబు ఇలా విదేశీ పర్యటనకు వెళ్లడం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మహేష్ బాబు మరియు నమ్రత లతో పాటు వారి పిల్లలు కూడా సరదాగా విదేశాల్లో కొన్నిరోజుల పాటు సందడి చేస్తారు.
ఆ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే త్రివిక్రమ్ సినిమా మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది కాలంగా ఆ సినిమా గురించి జనాల్లో ఆసక్తి కనిపిస్తుంది.గత ఏడాది అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ను ఈ ఏడాది జనవరి లో ప్రారంభిస్తారు అంటూ వార్తలు వచ్చాయి.
కాని సినిమా ఇంకా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పటికే ఆలస్యం అయిన సినిమా ను వెంటనే ప్రారంభించాలంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
కాని మహేష్ బాబా మాత్రం టూర్ కు వెళ్లి వచ్చాక త్రివిక్రమ్ కు డేట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.







