భారత్‌కు ఆయుధాల ఎగుమతులు పెంచండి: బైడెన్‌కు ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడి విజ్ఞప్తి

భారత్‌కు వ్యూహాత్మక ఆయుధాల సరఫరాను పెంచాలని భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు.

తద్వారా చైనా ఆక్రమణల ముప్పు నుంచి భారత్ రక్షణ పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా విస్తరణ కాంక్ష నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారత్‌కు అమెరికా ఆయుధాల సరఫరాను పెంచాలని ఖన్నా కోరారు.రష్యాతో పోలిస్తే అమెరికా ఆయుధాలనే భారత్ ఎంచుకుంటుందని ఇండో అమెరికన్ కమ్యూనిటీ సభ్యుడు అజయ్ భూటోరియాతో సమావేశం ముగిసిన తర్వాత రో ఖన్నా ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రపంచ స్థిరత్వం కోసం ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, అమెరికాలు పరస్పరం ఆధారపడి వున్నాయని అజయ్ భూటోరియా అన్నారు.ఆస్ట్రేలియా, జపాన్, భారత్, అమెరికాలు కలిసి క్వాడ్ ఏర్పాటు చేయడం ద్వారా చైనా ప్రభావాన్ని తగ్గించడంలో, డ్రాగన్‌ను ఎదుర్కోవడంలో బలమైన పాత్ర పోషిస్తోందన్నారు.

రక్షణ రంగంలో భారత్‌తో అమెరికా బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించి.అవసరమైన వాటిని సరఫరా చేయాలని భూటోరియా కోరారు.

Advertisement

కాగా.ఇటీవల ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా వుండటం పట్ల రో ఖన్నా భారత ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

చైనా విస్తరణ ప్రణాళికలకు వ్యతిరేకంగా భారత్‌కు అండగా నిలబడేది అమెరికాయే తప్ప.రష్యా కాదని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.1962లో ఇండియాపై చైనా దాడి సమయంలో భారత్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ అండగా నిలిచారని ఖన్నా గుర్తుచేశారు.పుతిన్‌కు వ్యతిరేకంగా ఇది భారత్ నిలబడాల్సిన సమయమని.

గైర్హాజరు కావడం ఆమోదయోగ్యం కాదన్నారు.రో ఖన్నాతో పాటు మరో కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ స్వాల్వెల్ కూడా భారత్ చర్య నిరాశను కలిగించిందన్నారు.

భారతీయ అమెరికన్లు ప్రాదేశిక సమగ్రత, మానవ హక్కులను విశ్వసిస్తారని స్వాల్వెల్ చెప్పారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మరోవైపు చైనాతో పెరుగుతోన్న మాస్కో సాన్నిహిత్యం.రష్యా ఆయుధాలపై ఆధారపడటం సహా భారతదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అమెరికా వ్యూహాత్మక విభాగంలోని పలువురు ఇటీవలి కాలంలో వాదించారు కూడా.భారత్‌కు మద్ధతుగా వుండే రిపబ్లికన్ సభ్యులలో కొందరు కూడా ఓటింగ్ వేళ న్యూఢిల్లీ వైఖరిపై గుర్రుగా వున్నారు.

Advertisement

సౌత్ కరోలినా నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జో విల్సన్ భారత్ చర్యపై అసహనం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు