సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజా ఆగ్రహం తప్పదు:- ప్రజా సంఘాలు నిరసన ధర్నా

ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే TRS ప్రజా ప్రతినిధులు ప్రజా ఆగ్రహానికి గురి కాకతప్పదు అని CITU జిల్లా నాయకులు వై విక్రమ్ హెచ్చరించారు.CITU , ఐద్వా, DYFI, KVPS, ఆవాజ్, NPRD, ఆధ్వర్యంలో గురువారం ప్రజా సమస్యలపై భారీ ధర్నా నిర్వహించారు.

 If The Problems Are Not Solved, Public Outrage Is Inevitable: - Public Associati-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ళు, పెన్షన్ లు, రేషన్ కార్డులు తదితర స్ధానిక సమస్యలు పరిష్కారం చేయడంలో TRS పాలకవర్గం విఫలం అయింది అని విమర్శించారు.రోడ్ మీద నాలుగు పూలు కుండీలు పెట్టి ఖమ్మం అభివృద్ధి అయిందని TRS ప్రజా ప్రతినిధులు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా గోడల మీద బొమ్మలు వేస్తే ప్రజల కడుపు నిండదని విమర్శించారు.మామిళ్ళగూడెం సారధి నగర్ అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారం చేయడంలో TRS జిల్లా మంత్రి విఫలం చెందారని విమర్శించారు.

డిపో రోడ్, NST రోడ్ వెడల్పుకు నిధులు మంజూరు చేయకుండా, నగరంలో ఒకే ఒక్క ప్రాంతంలో చుట్టూ అభివృద్ధి చేస్తున్నారు అని విమర్శించారు.రమణగుట్ట, రాపర్తి నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు.

వెంటనే ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే త్వరలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని అక్కడే వంట వార్పూ పెడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, N మనోహర్, SK మీరా సాహిబ్, MA జబ్బార్,R ప్రకాష్, డి తిరుపతిరావు, యస్ నవీన్ రెడ్డి, భుక్యా ఉపేంద్ర, MD గౌస్ CH భద్రం , రమేష్, డి నాగరాజు, హుస్సేన్, N కుమారి, పావని, బీబీ,బుర్రి శోభా, సాగర్, యేటా రాజేష్, కె రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube