ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 15 వేల రూపాయల స్టడీమెటీరియల్ గ్రూప్1 , గ్రూప్ 2 పుస్తకాలను , కీర్తిశేషులు డాక్టర్ కనక బండి మోహనరావు జ్ఞాపకార్థం వారి మనమలు ప్రణయ్ మోహన్ , ప్రద్యుత్తు మోహన్ లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు కు పుస్తకాలను అందించారు .ఈ సందర్బంగా గ్రంథాలయ ఛైర్మన్ మాట్లాడుతూ గ్రూప్1, గ్రూప్ 2 ఎస్సై కానిస్టేబుల్ పిప్రరెయె విద్యార్థులకు కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని , కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలియజేశారు .
కావున తప్పకుండా గ్రంథాలయానికి విద్యార్థులు వచ్చి ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏ.మంజువాణి , అసిస్టెంట్ లైబ్రేరియన్ ఆర్.నాగన్న తదితరులు పాల్గొన్నారు .







