వ్యాపార నిమిత్తం రోజు విమానాల్లో ప్రయాణించేవారికి విమానాయణంపైన ఓ ఐడియా ఉంటుంది.అదే అత్యవసర సమయాలలో ప్రయాణించేవారికి కాస్త అవగాన కావాలి.
లేదంటే, మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.ముఖ్యంగా చదువులేనివారు, అంతగా అవగాహన లేనివారు విమానప్రయాణం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
అన్ని వయసులవారు విమానాల్లో ప్రయాణించడాన్ని మనం చూసుంటాం.అలాగే వారి వెంట పిల్లలు కూడా వెళ్లడం సర్వ సాధారణ విషయం.
అయితే విమానంలో వెళ్ళడానికి పిల్లలకి కొన్ని ప్రత్యేక నియమాలు, నిబంధనలు ఉన్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు?
ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.ముఖ్యంగా చిన్నపిల్ల వయస్సు, ఒకవేళ వారు ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తే వయస్సు లిమిటేషన్ ఎంతుండాలి? అనే విషయాలలో కొన్ని నియమాలు ఉన్నాయి.ఇపుడు అవేమిటో తెలుసుకోండి.ముందుగా చిన్నపిల్లలు విమానంలో ఒంటరిగా ప్రయాణించడం గురించి మాట్లాడుకుంటే.5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే విమానంలో ఒంటరిగా ప్రయాణించడానికి అర్హులు.అయితే ఇక్కడ ప్రతి విమానయాన సంస్థకు దాని సొంత నియమాలు కూడా ఉన్నాయనేది మర్చిపోవద్దు.
ఒకవేళ పిల్లలకు ఒంటరిగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విమానంలో పంపాలనుకుంటే.ఇలా చేయవచ్చు.

కొన్ని విమానయాన సంస్థలు పిల్లల కోసం ‘ఫ్లైయింగ్ సోలో’ వంటి సౌకర్యాలను కూడా కల్పించడం విశేషం.ఇక్కడ మాత్రం ఎలాంటి వయస్సు కలిగిన పిల్లలైనా ప్రయాణించే వీలుంది.వారం రోజుల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చైల్డ్ కేటగిరీలో ఇక్కడ ప్రయాణించవచ్చు.అయితే సదరు పిల్లలు తప్పనిసరిగా జనన ధృవీకరణ పత్రం మాత్రం కలిగి ఉండాలి.
ఆసుపత్రి నుంచి తల్లి డిశ్చార్జ్, పాస్పోర్ట్ మొదలైనవి చూపించాలి.అయితే ఇక్కడ శిశువుల విభాగంలో పిల్లలకు ప్రత్యేక సీటు లభించదన్న విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి.







