టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు లేనివిధంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు.2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితులు తన చేజారిపోకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.సమయం .సందర్భం వచ్చినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో ఎప్పుడూ ఈ నియోజకవర్గంపై ఇంతగా దృష్టి పెట్టలేదు.ఎమ్మెల్యే గా నామినేషన్ దాఖలు చేసే సమయంలోనూ చంద్రబాబు స్వయంగా హాజరయ్యేవారు కాదు.పార్టీ నేతల ద్వారానే నామినేషన్ పత్రాలను పంపించే వారు.అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించక పోయినా గెలుస్తూనే వస్తున్నారు.
అయితే అప్పటి పరిస్థితి వేరు.ఇప్పుడు చంద్రబాబు పట్టు నియోజకవర్గం లో చేజారిపోయింది.
వైసిపి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా టార్గెట్ చేసుకోవడంతోపాటు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా ఈ నియోజక వర్గాన్ని టార్గెట్ చేసుకోవడం, వైసిపి ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి భారీగా నిధులను కేటాయిస్తూ ప్రజల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అంతే కాదు ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న నాయకులు అందరిని తమ పార్టీలో చేర్చుకునే విషయంలో సక్సెస్ అవుతూ వస్తోంది.
ఏదో రకంగా 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే ఏకైక లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం తో ముందుగానే చంద్రబాబు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ, పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.ఈ మేరకు ఈరోజు నుంచి శుక్రవారం వరకు చంద్రబాబు కుప్పం నియోజకవర్గం లోనే పర్యటించబోతున్నారు.
ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలకు ఆయన రూపకల్పన చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో వైసిపి తన సత్తా చాటుతూ వస్తూ ఉండడంతో, ఈ నియోజకవర్గంలో పట్టు చేజారి పోతోంది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో పరిస్థితి తారుమారు కావడంతో బాబు ఇంతగా టెన్షన్ పడుతూ, నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తున్నారు.బాబు కుప్పం పర్యటనకు మైలేజ్ రాకుండా వైసిపి సైతం అంతే స్థాయిలో రాజకీయ వ్యూహాలను రూపొందిస్తోంది.







