అలా మొదలైంది సినిమాతో లేడీ దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దర్శకురాలు నందిని రెడ్డి.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ ఉండటం చాలా అరుదు.
కానీ నందిని రెడ్డి మాత్రం ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి నిలదొక్కుకున్నారు.సాధారణంగా మహిళలు అంటే అన్ని రంగాలలో కూడా ఎంతో చులకన భావం ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని తాజాగా నందినిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా నందిని రెడ్డి మాట్లాడుతూ కల్యాణ వైభోగమే సినిమా షూటింగ్ సమయంలో తాను మహిళ అనే కారణంతో ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ తన గురించి ఎంతో నీచంగా మాట్లాడాడని వెల్లడించారు.
ఆ సినిమాకు కెమెరా లెన్స్ రద్దుచేశారు.కానీ వాటిని నేను తెప్పించుకున్నాను.దీంతో అతనిలో నాకు తెలియకుండా ఇన్ని చేస్తుందా అనే ఫీలింగ్ కలిగింది.అయితే షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు ఒక కెమెరా లెన్స్ పడిపోయింది.
దాని విలువ సుమారు 20 వేల వరకు ఉంటుంది.

ప్రస్తుతం షూటింగ్ పూర్తయిన తర్వాత దాని గురించి మరి మాట్లాడుకుందాం అని నేను వదిలేశాను.అయితే ఆ వ్యక్తి మాత్రం నా అసిస్టెంట్ దగ్గరకు వెళ్లి అసలు ఏమనుకుంటుంది అది ఇది అంటూ నా గురించి ఏకవచనంతో మాట్లాడారు ఇక ఈ విషయం నా దృష్టికి రావడంతో నిర్మాతతో గొడవ పెట్టుకుంటున్నానని, అతను సెట్ లో ఉంటే తాను షూటింగ్ చేయనని కరాఖండిగా చెప్పేసాను.నా మాటలు విన్న ప్రొడ్యూసర్ అతనికి యూనియన్ కాంటాక్ట్స్ ఉన్నాయి అనవసరంగా గొడవ ఎందుకు అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఆయన ఎన్ని చెప్పినా అతను ఇక్కడ ఉంటే నేను రాను అంటూ ఈమె గొడవ పెట్టుకున్నారని చివరికి అతనిని ప్రొడ్యూసర్ అక్కడినుంచి పంపించారని ఈ సందర్భంగా గతంలో తనకు జరిగిన ఈ విషయం గురించి నందిని రెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం నందిని రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







