టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటించారు.ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు బిత్తిరి సత్తితో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా బిత్తిరి సత్తి సినిమా గురించి ఎన్నో విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమా సీక్వెల్ చిత్రం ఉంటుందా అనే ప్రశ్న కూడా ఎదురయ్యింది.
ఇక ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ ఇప్పటివరకు సీక్వెల్ గురించి ఏమాత్రం ఆలోచించలేదని మహేష్ బాబు తెలియజేశారు.భవిష్యత్తులో చెప్పలేము అంటూ సమాధానం చెప్పారు.
ఇలా సీక్వెల్ గురించి మహేష్ బాబు క్లారిటీగా చెప్పక పోయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.అదే విధంగా తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న మేజర్ సినిమా గురించి కూడా మహేష్ బాబు ఇంటర్వ్యూ లో ప్రస్తావించారు.

ఇక ఈ సినిమా గురించి మహేష్ బాబు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ పాటలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచారు.ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించారు.







