ఆ కారణం వల్ల పెళ్లి మధ్యలో ఆపేసిన వధువు.. ఫన్నీ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో కొన్ని పెళ్లి వీడియోలు మనల్ని బాగా భావోద్వేగానికి గురి చేస్తాయి.మరికొన్ని వీడియోలు చూస్తే నవ్వురాక తప్పదు.

 The Bride Who Stopped In The Middle Of The Wedding For That Reason Funny Video-TeluguStop.com

అయితే తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక వధువు ఓ చిన్న కారణంతో తన పెళ్లి తంతును మధ్యలోనే ఆపేసింది.

మళ్లీ తన పెళ్లిని కొనసాగించింది అనుకోండి కానీ పెళ్లి బంధంతో ఒకటవుతారన్న క్షణంలోనే ఆమె మైక్ చేసుకొని తన వివాహాన్ని కాసేపు ఆపేయాలని కోరింది.దీంతో అవాక్కవడం బంధుమిత్రుల వంతయింది.

వివరాల్లోకి వెళితే… బెక్కీ జెఫరీస్ అనే ఒక యువతి తన భర్తతో కలిసి తన వివాహ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొంది.ఇదే సమయంలో తాను పూర్తిగా వెడ్డింగ్ డ్రెస్ ధరించలేదని జ్ఞాపకం చేసుకుంది.

తన వివాహ గౌనులోని ఒక అటాచ్‌మెంట్ డ్రెస్ మిస్ అయిందని తెలుసుకుంది.ఆ తర్వాత కాసేపు పెళ్లి ఆపాలంటూ విజ్ఞప్తి చేసింది.

తన బంధువులు ఆ డ్రెస్ తెచ్చేంత వరకు ఆమె తన వివాహ వేడుకను నిలిపేసింది. వెడ్డింగ్ డ్రెస్ లోని ఒక భాగాన్ని మర్చిపోవడం ఏంటి.? అది మర్చిపోయానని పెళ్లి మధ్యలో ఆపు చేయడం ఏమిటని చాలా మంది నోరెళ్ళబెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో వధువు మైక్ తీసుకొని పెళ్లిని నిలిపేసింది.

తర్వాత ఒకరు వెడ్డింగ్ డ్రెస్ లోని ఒక భాగాన్ని తీసుకొచ్చారు.ఆమె ఈ డ్రెస్సు ధరించాక పెళ్లి మళ్ళీ మొదలు కావడం గమనించవచ్చు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.ఏది ఏమైనా ఈ వధువు డ్రెస్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.

పెళ్లి కోసమని తాను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ పూర్తిగా ధరించిన తర్వాతే తన జీవితంలో మధురమైన ఘట్టాన్ని పూర్తిచేసింది.అలా ఈ వధువు చాలామంది నెటిజన్ల మనసులను దోచేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube