సర్కారు వారి విషయంలో కొరటాలకు కృతజ్ఞతలు తెలిపిన పరశురామ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Parashuram Thanked Koratala Shiva For Sarkaru Vari Paata Movie Details, Parashu-TeluguStop.com

ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు.ఇక డైరెక్టర్ పరుశురామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రధాన కారణం కొరటాల శివ అని వెల్లడించారు.

ముందుగా మహేష్ బాబుతో కాంటాక్ట్ అవ్వడానికి కొరటాల శివ చాలా సహాయం చేశారు.

కొరటాల శివ కారణంగానే సర్కారు వారి పాట సినిమా ఇంత త్వరగా పూర్తి అయిందని డైరెక్టర్ పరశురామ్ తెలియజేస్తూ డైరెక్టర్ కొరటాల శివకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక మహేష్ తో కాంటాక్ట్ ఏర్పడిన తర్వాత తనకు కథ నేరెట్ చేసేటప్పుడు కలిగిన అనుభవం గురించి డైరెక్టర్ వెల్లడించారు.

Telugu Koratala Shiva, Keerthy Suresh, Mahesh Babu, Parashuram, Sarkaruvaari, To

మహేష్ బాబుకు కథ చెప్పేటప్పుడు చాలా టెన్షన్ పడ్డానని అయితే ఆ సమయంలో మహేష్ బాబు చిన్న స్మైల్ ఇవ్వటం వల్ల తనకు టెన్షన్ మొత్తం వెళ్లిపోయిందని ఆ స్మైల్ ఇంతవరకు తీసుకువచ్చిందని డైరెక్టర్ పరశురామ్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube