ప్రధాని రాజీనామా మరింత కష్టాల్లోకి శ్రీలంక..!!

గత కొద్ది రోజుల నుండి శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే.శ్రీలంక ఇటువంటి దారుణమైన పరిస్థితి కి రావడానికి ప్రధాన కారణం దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే… మరియు ఆయన సోదరుడు ప్రధాని మహేంద్ర రాజపక్సే కారణం అని గత కొద్ది రోజుల నుండి ప్రజలు తీవ్రమైన ఆందోళన చేపడుతున్నారు.

 Prime Minister's Resignation Puts Sri Lanka In More Trouble , Sri Lanka Pm , Ma-TeluguStop.com

ఇటువంటి తరుణంలో సైన్యం రంగంలోకి దిగినప్పటికీ ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.మరింతగా ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో అధ్యక్షుడు మరియు ప్రధాని నివాసం పై కూడా దాడికి ప్రయత్నాలు చేయడం జరిగింది.దీంతో ప్రజలను నిలువరించడానికి సైన్యం పలు చోట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆందోళనలు హింసాత్మకంగా మారుతూ వస్తున్నాయి.

అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధ్యక్షుడు రెండుసార్లు ఎమర్జెన్సీ విధించారు.సైన్యానికి సర్వాధికారాలు ఇవ్వడం జరిగింది.అయినప్పటికీ దేశంలో పరిస్థితులు ఎక్కడ కూడా అదుపులోకి రాలేదు.ఈ విషయం నడుస్తూ ఉండగానే ఈరోజు దేశ రాజధాని కొలంబోలో కర్ఫ్యూ విధించారు.

మరోపక్క ప్రతిపక్షాలు వారం రోజుల్లో రాజపక్సే సోదరులు రాజీనామా చేయాలని డెడ్ లైన్ విధించాయి.దీంతో గడువుకు ముందే శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.

రాజీనామా చేయడానికి మందు సోషల్ మీడియాలో ఆర్థిక సంక్షోభానికి త్వరలో పరిష్కారం లభిస్తుంది.హింసాత్మక ఘటనలు మరియు భావోద్వేగాలకి  ఎక్కడ ప్రజలు లోను కాకూడదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube