విదేశాల నుండి వచ్చే వలస పక్షులు ని కాపాడండి: నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

విదేశాల నుండి వచ్చే వలస పక్షులు ని కాపాడండి అని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు.సోమవారం ఉదయం జీవీఎంసీ లోని ఆమె చాంబర్లో విశాఖ జిల్లా ఎన్జీవోస్ ఫోరం వలస పక్షుల పరిరక్షణ పోస్టర్ను విడుదల చేశారు.

 Protect Migratory Birds From Abroad: City Mayor Golagani Hari Venkata Kumari-TeluguStop.com

ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వలస పక్షుల పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆ కార్యక్రమాన్ని విశాఖ నగరంలో స్వచ్ఛంద సేవా సంస్థ లు నిర్వహించడం ఆనందదాయకం అన్నారు.భూగోళం మీద మాత్రమే జీవావరణం ఉందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆమె పేర్కొన్నారు.

శీతోష్ణస్థితి వేడెక్కుతున్న తరుణంలో జీవవైవిద్యం మీద దాని ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.ఇటువంటి తరుణంలో మనమంతా సమస్త జీవరాశిని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

విశాఖ జిల్లా ఎన్జీవోస్ ఫోరం అధ్యక్షురాలు డాక్టర్ శశి ప్రభ మాట్లాడుతూ అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం ని దృష్టిలో లోనికి తీసుకొని విశాఖ జిల్లాలో వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఇందులో భాగంగా గ్రీన్ అంబాసిడర్ లు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారని ఆమె పేర్కొన్నారు.

ప్రధానంగా విద్యార్థుల్లో పర్యావరణం పట్ల, జీవవైవిద్యం పట్ల ప్రేమ కలిగి జీవించేలా తమ గ్రీన్ అంబాసిడర్ లు కృషి చేస్తున్నారన్నారు.వేలాది మంది విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమాన్ని తమ సంస్థ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞాన్ కుమార్, మ్యాజిక్ బస్సు ప్రతినిధి శ్రీకృష్ణ, గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధి జె వి రత్నం.అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ పవర్ ప్రతినిధి భాస్కర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube