రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.దీనికి తగ్గట్లుగానే ఆయన ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది.
దీంతో రాజకీయ వ్యూహకర్త కాస్త నాయకుడిగా మారబోతున్నాడు అనే సెటైర్లు ఆయనపై వచ్చాయి.అంతేకాదు ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ద్వారా బీజేపీ వ్యతిరేక పార్టీల అన్నిటిని కలిపి ఒక కూటమి ఏర్పాటు చేస్తారని ప్రచారం ఉదృతంగా సాగుతున్న సమయంలోనే.
తాజాగా ఈ వ్యవహారంపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు.తాను కొత్త పార్టీ పెట్టడం లేదని, ప్రస్తుతానికి కొత్త పార్టీ ఆలోచన ఏమీ లేదని.
బీహార్ పురోభివృద్ధి తన లక్ష్యమంటూ ప్రకటించారు
.
ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు.
బీహార్ పూర్తిగా వెనుకబడి పోయిందని, బీహార్ పురోగతి కోసమే తాను ప్రయత్నిస్తాను అంటూ ప్రకటించారు.ఈ మేరకు బీహార్ వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టబోతున్నానని , ఈ యాత్రలో ప్రజల అభిప్రాయాల మేరకు కొత్త పార్టీ అవసరం అనుకుంటే అప్పుడు పార్టీ పేరు, దాని విధి విధానాలను ప్రకటిస్తామని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఆయన ఇచ్చిన క్లారిటీతో అందరిలోనూ మరో గందరగోళం మొదలైంది.ఇప్పటి వరకు ఆయన పార్టీ పెడతారని, అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ప్రజల్లోకి తీసుకు వెళతారని అంతా భావిస్తున్న సమయంలో పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన ట్విస్ట్ ఇచ్చాడు.

ఇప్పటికే ఏపీ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి సక్సెస్ అయ్యారు .ఈ యాత్ర సక్సెస్ కావడం లో ప్రశాంత్ కిషోర్ ,ఆయనకు చెందిన ఐప్యాక్ టీం విశేషంగా కృషి చేసింది.ఇప్పుడు పీకే పాదయాత్రతో బీహార్ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా , దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమి బలపడే విధంగా ప్రశాంత్ కిషోర్ ఆలోచన చేస్తున్నారట.