ఈమద్య కాలంలో ప్రతి హీరో కూడా తన సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నాం.తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నాం అంటూ గొప్పలు చెబుతున్నారు.
సినిమాలో కంటెంట్ ఉన్నా లేకున్నా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి కొన్ని సినిమాలు చేతులు కాల్చుకుంటున్నాయి.పుష్ప.
ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు వందల కోట్ల వసూళ్లు బాలీవుడ్ లో సాధించడంతో ఇప్పుడు తెలుగు సినిమాలు చాలా వరకు ఉత్తర భారతం పై దృష్టి పెట్టాయి.చిన్న హీరోలు కూడా ఉత్తర భారతంలో దున్నేయాలని భావిస్తుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం హిందీ బాక్సాఫీస్ పై ఆసక్తి చూపించడం లేదు.
సర్కారు వారి పాట సినిమాను హిందీలో విడుదల చేయాలని చాలా మంది ఒత్తిడి తీసుకు వచ్చినా కూడా మహేష్ బాబు అందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ సమాచారం అందుతోంది.సర్కారు వారి పాట సినిమా హిందీ వర్షన్ విడుదల చేయక పోవడం కు కారణం ఏంటీ అనేది మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేడయం లేదు.
కేవలం హిందీ వర్షన్ మాత్రమే కాకుండా ఏ ఇతర భాషల్లో కూడా సినిమాను విడుదల చేయడం లేదు.కేవలం తెలుగు లోనే సినిమాను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు భాష తో పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా ను దేశ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా ను విడుదల చేస్తున్నాం అంటూ నిర్మాతలు చెబుతున్న నేపథ్యంలో ఎంత వరకు ఇది వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.మే 12 వ తారీకున ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.