మే నెల ప్రారంభమైందో లేదో భానుడు భగభగమంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు.చాలా ప్రాంతాల్లో వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
అయితే మండే ఎండలు, వేడి గాలుల కారణంగా కళ్ళు తడారిపోయి మంట పుడుతుంటాయి.ఈ సమస్యను చాలా మంది ఫేస్ చేస్తుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే చింతించకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలా సులభంగా కళ్ల మంటలను తగ్గించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ.
కళ్ళు మంటను తగ్గించడంలో కలబంద గ్రేట్‌గా సహాయపడుతుంది.ఒక కలబంద ఆకును తీసుకుని లోపల ఉన్న జెల్‌ను సపరేట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ అలోవెర జ్యూస్‌లో కాటన్ ప్యాడ్స్ వేసి ఒక నిమిషం పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటిని తీసుకుని కళ్ళపై పెట్టుకోవాలి.
ఇలా తరచూ చేస్తే కళ్ళ మంటలు క్రమంగా తగ్గిపోతాయి.
అలాగే స్ట్రాబెర్రీ పండ్లు కూడా కళ్ళు మంటను ఇట్టే పోగొట్టగలవు.
నాలుగైదు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్ నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకుని. ఐస్ ట్రేలో నింపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.మూడు, నాలుగు గంటల అనంతరం ఆ ఐస్ క్యూబ్స్‌తో కళ్ళ పై మసాజ్ చేసుకుంటే మంట నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఇక కళ్ళు మండేటపుడు కంప్యూటర్, ల్యాప్ టాప్ ఉపయోగించకండి.ఒకవేళ యూస్ చేసినా మధ్య మధ్యలో కాస్త రెస్ట్ తీసుకోండి.అలాగే ప్రస్తుత వేసవిలో జర్నీ చేసే వారు తప్పనిసరిగా కళ్లజోడు వినియోగించాలి.తరచూ ముఖాన్ని చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.మరియు శరీరానికి సరిపడా వాటర్ ను అందించాలి.