అబ్బురపరిచే ప్రాంతంలో బైక్ నడుపుతూ ఎంజాయ్ చేసిన చిన్నారి... వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

కొన్ని ప్రదేశాలు తమ ప్రత్యేకతతో మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి.ఈ కోవలోకి దక్షిణ అమెరికాలోని బొలీవియాలోని సాలార్ డి ఉయుని మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.

 A Child Who Enjoys Riding A Bike In A Dazzling Area If You Watch The Video, You-TeluguStop.com

ప్రపంచంలోనే అతిపెద్ద సాల్ట్ ఫ్లాట్ గా దీనిని పరిగణిస్తారు.అంటే ఉప్పు భూమి ఉపరితలం ఫ్లాట్ గా పేరుకుపోవడం.

అయితే ఈ ఉప్పు పైకి నీరు చేరినపుడు అది ఒక అద్దంలా మారుతుంది.అలా ఆకాశాన్ని ఇది నేలపై అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ఇలాంటి ప్రదేశంలో ఒక చిన్నారి తాజాగా ఒక దర్ట్ లేదా ఆఫ్ రోడ్ బైక్ నడుపుతూ ఎంజాయ్ చేసింది.ఆమెను కొందరు పెద్ద వాళ్ళు వేరే వెహికల్ లో ఫాలో అవుతూ వీడియో తీశారు.

దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ ట్విట్టర్ ఖాతా అయిన బ్యూటెంగెబిడెన్ అనే పేజ్ దీనిని షేర్ చేసింది.

ఈ వీడియో లో ఒక చిన్నారి ఆఫ్ రోడ్ బైక్ నడుపుతూ వేగంగా నీటిలో దూసుకెళ్లడం చూడొచ్చు.

అయితే ఈ దృశ్యం చూస్తుంటే ఆకాశంలో మబ్బుల మధ్యలో చిన్నారి బైక్ పై వెళ్తున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది.అయితే నీటిలో ఈ బైక్ జార లేదు.ఎందుకంటే దీని టైర్లు మంచి గ్రిప్ కలిగి ఉన్నాయి.56 సెకన్ల నిడివిగల ఈ వీడియో ఆద్యంతం చూపు తిప్పుకోనివ్వని విధంగా ఆకట్టుకుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అబ్బుర పడుతున్నారు.ఇలాంటి అద్భుతమైన, బ్రహ్మాండమైన దృశ్యాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్ష వరకు వచ్చాయి.ఈ వండర్ ఫుల్ వీడియో ని మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube