ఆస్ట్రేలియా తీరంలో డజన్ల కొద్దీ తలలు లేని పెంగ్విన్‌లు కనిపించాయి.శాస్త్రవేత్తలు దీనికిగల కారణాన్ని అన్వేషిస్తున్నారు.
ఆస్ట్రేలియా బీచ్‌లలో కనిపించిన ఈ దృశ్యం చూసి చాలామంది తెగ ఆశ్చర్యపోవడంతోపాటు ఆవేదన చెందుతున్నారు.తలలు నరికేసిన డజన్ల కొద్దీ పెంగ్విన్‌లు ఇక్కడ కనిపిస్తున్నాయి.
పెంగ్విన్‌ల పరిస్థితి చూసి శాస్త్రవేత్తలు కలత చెందుతున్నారు.ఇన్ని పెంగ్విన్‌లను శిరచ్ఛేదం చేయడం వెనుక గల కారణాలేమిటని ఆరా తీస్తున్నారు.
ఒక్క ఏప్రిల్ నెలలోనే దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లూరియూ ద్వీపకల్పంలోని బీచ్‌లలో దాదాపు 20 పెంగ్విన్‌ల మృత కళేబరాలు లభ్యమయ్యాయి.ఈ సంఖ్య 2021లో ఈ ప్రాంతంలో చనిపోయిన పెంగ్విన్‌ల సంఖ్య కంటే ఎక్కువ.
దక్షిణ ఆస్ట్రేలియాలో స్టీఫెన్ హెడ్జెస్.ఈ చనిపోయిన పెంగ్విన్‌ల మృత కళేబరాలను సేకరిస్తున్నారు.
తద్వారా వాటిపై అధ్యయనం చేయవచ్చని భావిస్తున్నారు.వాటి తలలు ఎందుకు తెగిపడ్డాయో తెలుసుకునే పనిలో పడ్డారు.
సముద్రం ఒడ్డున పెంగ్విన్‌ల మృతదేహాలే కాదు, తెగిపడిన వాటి తలలు కూడా కనిపిస్తున్నాయి.సముద్రంలో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నందున ఈ ఉదంతంలో మానవ హస్తం ఉండే అవకాశం లేదు.
అయితే ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నౌకలు ఉండే అవకాశం ఉందని స్టీఫెన్ హెడ్జెస్ అన్నారు.ఫిషింగ్ బోట్ ఫ్యాన్స్ వీటి మరణానికి కారణం కావచ్చంటున్నారు.
సాధారణంగా ప్రతి నెలా బీచ్‌లలో ఒకటి లేదా రెండు చనిపోయిన పెంగ్విన్‌లు కనిపిస్తాయని, అయితే ఏప్రిల్‌లో మాత్రమే 15 నుండి 20 మృతకళేబరాలను కనుగొన్నామని ఆయన చెప్పారు.ఒక్కోసారి ఒక్కరోజులో మూడు మృతదేహాలు కూడా దొరికాయి.
పెంగ్విన్ తల ఒక్కసారిగా తెగిపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.స్టీఫెన్ హెడ్జెస్ మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్ బే సమీపంలో ఇటీవల ఫిషింగ్ పోటీ జరిగిందని, అది పడవల చుట్టూ పెంగ్విన్‌లను ఆకర్షించి ఉండవచ్చు.
ఇది కాకుండా పెంగ్విన్‌ల హత్యల వెనుక పర్యాటకం కూడా ఒక కారణం కావచ్చు.ఎందుకంటే ఈస్టర్ తో పాటు వారాంతాల్లో చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చారు.
చాలా మంది పర్యాటకులు తమ కుక్కలతో సముద్ర తీరంలో తిరుగుతుంటారు.ఇదే కాకుండా ఈ పని నక్కల ద్వారా కూడా జరిగివుండవచ్చంటున్నారు.
అయితే అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టాలంటే మరో రెండు మూడు వారాలు ఆగాల్సిందే.గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికా తీరంలో అంతరించిపోతున్న 63 ఆఫ్రికన్ పెంగ్విన్‌లను తేనెటీగల గుంపు చంపేసింది.
పోస్ట్‌మార్టంలో పెంగ్విన్ కళ్ల చుట్టూ తేనెటీగ కుట్టినట్లు గుర్తించారు.







