ఎంత స్టార్ డమ్ ఉన్న ఈ రోజుల్లో ప్రేక్షకులకు కథ నచ్చకపోతే ఆ సినిమా డిజాస్టర్ గానే మిగిలి పోతుంది.మా హీరో, మా హీరో సినిమా ఖచ్చితంగా హిట్ చేయాలి అని ఎవ్వరు చూడడం లేదు.
కథ నచ్చకపోతే నిర్ధాక్షణంగా ప్లాప్ చేసేస్తునాన్రు.మరి మన టాలీవుడ్ హీరోల కెరీర్ లో ఇలాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు ఏంటో చూద్దాం.
అజ్ఞాతవాసి :
పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎంత భారీ హైప్ తో వచ్చిందో అంత డిజాస్టర్ గా మిగిలింది.ఈ సినిమా దాదాపు 66 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు లెక్కలు చెబుతున్నాయి.
రాధేశ్యామ్ :
ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ ఈ సినిమా దడపా 90 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సాహో :
ఇది కూడా ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలి పోయింది.బాహుబలి తర్వాత చేసిన సినిమా కావడంతో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.కానీ ఆ అంచనాలను ప్రభాస్ అందుకోలేక పోయాడు.యువీ క్రియేషన్స్ కు దాదాపు 52 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.కానీ ఈ సినిమా హిందీలో మాత్రం 100 కోట్లకు పైగానే వసూళ్లు చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.

ఎన్టీఆర్ కథానాయకుడు :
బాలకృష్ణ నటించిన తన తండ్రి బయోపిక్ ఇది.క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు.కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి 50 కోట్ల నష్టాలను మిగిల్చింది.
అలాగే సెకండ్ పార్ట్ మహానాయకుడు కూడా 47 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.

సైరా నరసింహారెడ్డి కి 43 కోట్ల లాస్, మహేష్ స్పైడర్ కు 59 కోట్ల నష్టం వచ్చింది.1 నేనొక్కడినే కు 42 కోట్ల నష్టం, బ్రహ్మోత్సవం 38 కోట్లు, సర్దార్ గబ్బర్ సింగ్ 37 కోట్ల నష్టం తెచ్చిపెట్టాయి.ఇక ఇప్పుడు ఆచార్య కు వచ్చిన టాక్ చూస్తుంటే ఈ లిస్టులో రెండు కానీ మూడు స్థానాన్ని లాక్కునేటట్టు ఉంది.