నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు:- మంత్రి పువ్వాడ అజయ్ సవాల్

ఖమ్మం నగరాభివృద్దిని ప్రతిపక్ష పార్టీలు అడుగుఅడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని, నా కాళ్ళల్లో కట్టెలు పెట్టీ మరీ అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లకు ఒక్కటే చెప్తున్నా, నా స్పీడు తగ్గదు ఖమ్మం అభివృద్ది ఆగదు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు.

 My Speed Will Not Slow Down .. Khammam Development Will Not Stop: - Comments By-TeluguStop.com

మే డే నీ పురస్కరించుకొని ఖమ్మం నగరంలో జడ్పి సెంటర్ లో TRSKV ట్రేడ్ యూనియన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.సంఘటిత, అసంఘటిత రంగాలు అనే తేడా లేకుండా కార్మికులకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కార్మికుల సంపూర్ణ సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.

ఇక ఖమ్మం నగరభివృద్ధిని చూసి కొందరు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని, మంచి వాతావరణంను చెడగొట్టడనికి ప్రత్యేకంగా కొందరు తయారయ్యారని విమర్శించారు.పార్టీలు ఏవైనా కావచ్చు కాని, కొన్ని మతోన్మాద పార్టీలు ప్రత్యేకంగా ఖమ్మం చేరినై అని వాటికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తామన్నారు.

హైద్రాబాద్, ఢిల్లీ నుండి కొందరు మాట్లాడుతున్నారని.మీకు కళ్ళు ఉంటే ఖమ్మం వచ్చి చూడండీ, అభివృద్ది మీద సవాల్ చేయండి.సిద్దంగా ఉన్నా ఆని సవాల్ విసిరారు.

తెరాస పార్టీకి ఖమ్మం కంచుకోట అని, అభివృద్దే మన ఎజెండా అని వ్యాఖ్యానించారు.

నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube