స్విగ్గీని కొనాలి అంటూ ఎలాన్ మస్క్ కి శుభ్ మన్ గిల్ విజ్ఞప్తి.. ట్వీట్ వైరల్!

ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత మిగతా కంపెనీలు కూడా కొనుగోలు చేయాలని చాలామంది నెటిజన్లు అతనికి విజ్ఞప్తి చేస్తున్నారు.తాము ఎక్కువగా అసంతృప్తి పెంచుకున్న కంపెనీలను కొనుగోలు చేసి వాటిని మెరుగుపరచాలని కూడా నెటిజన్లు కోరుతున్నారు.

 Indian Cricketer Subhman Gill Request To Elon Musk To Buy Swiggy Details, Elan M-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా మస్క్ ను ఆశ్రయించాడు.ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని కొనుగోలు చేయాలంటూ మస్క్ ను శుభ్‌మన్ గిల్ ట్వీట్ ద్వారా కోరాడు.

ఈ కంపెనీ సేవలు చాలా పేలవంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ విజ్ఞప్తి చేశాడు.ఫుడ్ ఆర్డర్‌ను సకాలంలో స్విగ్గీ ఏజెంట్ డెలివరీ చేయలేకపోయాడట.దీంతో కోపోద్రిక్తుడైన గిల్ ట్విట్టర్ లో దాని సేవల గురించి పేర్కొన్నాడు.

ఎలాన్ మస్క్ గారు, దయచేసి స్విగ్గీని కొనుగోలు చేయండి.అప్పుడైనా వారు సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తారు” అని గిల్ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్విగ్గీ కూడా అలర్ట్ అయింది.‘హాయ్ శుభ్‌మన్ గిల్.ట్విట్టర్ ఉన్నా లేకపోయినా మేం ఆర్డర్ల విషయంలో ఫాస్ట్ గా ఉంటాం.ఒకసారి మీ ఆర్డర్ వివరాలు పంపండి’ అని స్విగ్గీ ట్వీట్ చేసింది.అనంతరం గిల్ ఆర్డర్ కు సంబంధించిన వివరాలు సెండ్ చేసినట్టు స్విగ్గీ పేర్కొంది.

అయితే శుభ్‌మన్ గిల్ చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.చాలామంది కాస్త ఆలస్యమయితే ఇంత పెద్ద రచ్చ సృష్టించాలా అని అంటున్నారు.ఐపీఎల్ లో మీ పర్ఫామెన్స్ ఏం బాగోలేదు.

గుజరాత్ టైటాన్స్ మిమ్మల్ని తీసేసి వేరే ప్లేయర్ ని కొనుగోలు చేసినా బాగుండు అని కొందరు ఘాటు వ్యాఖ్యలు పెడుతున్నారు.ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ చాలా కష్టపడుతున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదు చేయడం అన్యాయమని మరికొందరు శుభ్‌మన్ కు చివాట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube