అయ్యో పెద్దాయన.. మళ్లీ అదే తడబాటు, బైడెన్‌‌ను ఆడుకుంటున్న నెటిజన్లు

వయోభారమో లేక కంగారు పడతారో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు తానుగా నవ్వుల పాలవుతున్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనది ఇదే తంతు.

 Joe Biden Fumbles On Word ‘kleptocracy’ During Address To Congress,joe Biden-TeluguStop.com

మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు బైడెన్.అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.

ఆతర్వాత ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కుతూ పలుమార్లు కాలు జారి కిందపడిపోవడంతో డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్లలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా – ఉక్రెయిన్ సమస్య గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు.బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.

ఇక ఈ నెల ప్రారంభంలో అమెరికా అణు సబ్‌మెరైన్ యూఎస్ఎస్ డెలావేర్‌ను జాతికి అంకితం ఇచ్చిన జో బైడెన్ ప్రసంగిస్తూ… మిషెల్ ఒబామా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైన కార్యక్రమాలను.ప్రస్తుత ప్రథమ మహిళ ముందుకు తీసుకెళుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి మిచె‌ల్‌ను మాజీ ప్రథమ మహిళ అని పిలవాల్సి ఉండగా.మాజీ ఉపాధ్యక్షురాలిని చేసేశారు బైడెన్.

ఇది జరిగిన వారానికే మళ్లీ తడబడ్డారు అగ్రరాజ్యాధినేత.గ్రీన్స్‌బోరోలోని నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.కుడిపక్కకు తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు.వాస్తవానికి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు.

ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.

ఇప్పుడు మరో కొత్త వివాదంలో ఇరుక్కున్నారు బైడెన్.ఇటీవల అమెరికా చట్టసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు ఇచ్చే బిలియనీర్‌లను వదలబోమని హెచ్చరించారు.

ఈ క్రమంలో క్లెప్టోక్రసీ అనే పదాన్ని పలకలేక తడబడ్డారు.అయినప్పటికీ తన ప్రసంగాన్ని కొనసాగించారు బైడెన్.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్ము దోచుకోవడాన్ని ఇంగ్లీష్‌లో క్లెప్టోక్రసీ అంటారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే కొందరు నెటిజన్లు బైడెన్‌ను విమర్శిస్తుంటే.మరికొందరు ఆయనకు మద్ధతుగా నిలుస్తున్నారు.

దీనికి కారణంగా లేకపోలేదు.చిన్నతనంలో జో బైడెన్ నత్తితో బాధపడ్డారు.

అయినప్పటికీ మొక్కవోని దీక్షతో అమెరికా అధినేతగా ఎదిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube