మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల పాటు రాజకీయాలలో బిజీగా ఉండటంతో సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.గడిచిన 15 సంవత్సరాలలో సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో నటించిన ఖైదీ నంబర్ 150 తమిళ సినిమాకు రీమేక్ కాగా సైరా నరసింహారెడ్డి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.వేర్వేరు అంశాలు కలిసిరావడంతో ఆ సినిమాలు ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయి.అయితే ఆచార్య సినిమా మాత్రం రొటీన్ మాస్ మసాలా సినిమా కావడం గమనార్హం.అయితే కథ రొటీన్ గా ఉన్నా కథనం కొత్తగా ఉంటే ప్రేక్షకులు పలు సందర్భాల్లో సినిమాను ఆదరించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
వాస్తవానికి ఆచార్య సినిమా 20, 30 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే హిట్టయ్యేదని చెప్పవచ్చు.ఆ కాలంలో ఈ తరహా సినిమాలను ఆదరించేవారు.అయితే చిరంజీవి ఈతరం ప్రేక్షకులను సైతం ఆచార్య మెప్పిస్తుందని పొరబడ్డారని తెలుస్తోంది.

ప్రేక్షకులను తక్కువగా అంచనా వేసి ఆచార్య మేకర్స్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో దెబ్బ తిన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆచార్య రిజల్ట్ టాలీవుడ్ మేకర్స్ కు కూడా గుణపాఠమని కామెంట్లు వినిపిస్తున్నాయి.మూస కథలకు కాలం చెల్లిందని ఈ సినిమా ప్రూవ్ చేసింది.
ఆచార్య తర్వాతైనా సినిమాల విషయంలో టాలీవుడ్ మేకర్స్ ఆలోచనలు మారతాయేమో చూడాల్సి ఉంది.
ఆచార్య మూవీ మిగిల్చే నష్టాలు సైతం అంచనాలను మించి ఉండబోతున్నాయని తెలుస్తోంది.2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.ఆచార్య ఫ్లాప్ తో చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఫ్లాప్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
చిరంజీవి ఫ్యూచర్ ప్రాజెక్ట్ లలో ఎక్కువ సినిమాలు రీమేక్ సినిమాలు కావడం గమనార్హం.







