బహుజనులను రాజ్యాధికారానికి దూరంగా నెట్టడానికే దళిత బంధు:- ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్

గత ఏడేళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్ర ప్రజల సంపదను అక్రమంగా దోచుకొని, దాచుకుంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

బహుజన రాజ్యాధికార యాత్ర 45 వ రోజు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం తూటికుంట్ల, రామారం,గార్లపాడులో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు పెద్దగా ఏమీ మేలు జరగలేదన్న ఆయన కేసీఆర్ కుటుంబం మాత్రం పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టుకున్నారని ఆరోపించారు.డా.బి.ఆర్ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్నే మార్చి వేసే కుట్రలకు కేసీఆర్ తెరతీశారని అన్నారు.కేసీఆర్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి బహుజనులంతా రాజకీయంగా చైతన్యవంతం కావాలన్నారు.

కేవలం దళితులను మరింత బానిసలుగా తయారుచేయడానికి దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని బహుజనులను రాజ్యాధికారానికి దూరంగా నెట్టడానికే దళిత బంధు,కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.తరతరాలుగా పాలకవర్గాలు ప్రవేశపెట్టే పథకాలకు బహుజనులను లబ్ధిదారులుగా చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు.

అధిపత్య పాలకులు ఇచ్చే ఎన్నికల తాయిలాలకు అలవాటు పడితే బహుజనుల భవిష్యత్ అంధకారం అవుతుందని తెలిపారు.కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టాడని, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

Advertisement

దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఆధిపత్య పార్టీల నేతలు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు,మద్యం పంపిణీ చేసి పేదల ఓట్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు మించి డబ్బు సంపాదించాలనే అత్యాశతో రాజకీయాలు బ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.తుటికుంట్లలో మొక్కజొన్న కల్లాలను పరిశీలించిన ఆయన రైతులకు అందుతున్న మద్దతు ధర, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రామారంలో 27 ఏళ్లుగా పూరి గుడిసెలో నివాసం ఉంటున్న ఓ కుటుంబాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు.గార్లపాడులో ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు.తదనంతరం గోవిందాపురం, బోనకల్,రాపల్లి,కే.

బ్రాహ్మణపల్లి, చిన్న బీరవల్లి,నారాయణపురంలో యాత్ర కొనసాగనుంది.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?
Advertisement

Latest Khammam News