ఆలిండియా మహాసభను జయప్రదం చేయండి: డివైఎఫ్ఐ పిలుపు

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 11 వ ఆల్ ఇండియా మహాసభలు మే 12 నుంచి 15 వరకు పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జరగబోతున్నాయని, ఈ మహాసభల సందర్భంగా 12 తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం జరుగుతుందని, ఈ మహాసభ లను, బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ డివైఎఫ్ఐ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు.స్థానిక ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు, కాచిరాజుగుడెం గ్రామాల్లో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన సర్వే నిర్వహించి, సభ్యత్వ కార్యక్రమమును ప్రారంభించారు.ఈ సందర్భంగా షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈ మహాసభలో పోరాటాలు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ముఖ్యంగా” లౌకిక భారత దేశాన్ని కాపాడుకునేందుకు – ఉద్యోగాల కోసం ఉద్యమిద్దాం ” అనే నినాదంతో ఈ పదకొండు మహాసభలు జరుగుతున్నట్లు ఆయన తెలియజేశారు.దేశంలో మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగాన్ని అవమానిస్తూ మార్చే ప్రయత్నం చేస్తున్నారని రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం, లౌకిక దేశాన్ని రక్షించుకునే దానికోసం యువత మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు .అలాగే దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.అలాగే రాష్ట్రంలో కూడా యువత ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు, పోరాటాలు రూపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన సర్వే నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు, కాచిరాజుగుడెం గ్రామాలలో సర్వే నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్ష కార్యదర్శులు జక్కంపూడి కృష్ణ, పొన్నం మురళి, మండల నాయకులు షేక్ చాంద్ పాష , హరీష్, పాపారావు, రామకృష్ణ, నవీన్, రాఘవులు, షేక్ జానీ, డివైఎఫ్ఐ నాయకులు ఇనుప నూరి వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

 Win The All India Mahasabha: Dyfi Call-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube