ఒక వ్యక్తి తన కుక్క కోసం వివాహాన్ని క్యాన్సిల్ చేశాడు.పైగా తన ప్రియురాలి నుంచి ప్రాణాపాయం తప్పిందని ఆ వ్యక్తి చెప్పాడు.
తన నిర్ణయాన్ని ప్రియురాలికి చెప్పాడు.నిశ్చితార్థం చేసుకున్న తరువాత కూడా ఇద్దరూ విడిపోయారు.28 ఏళ్ల ఒక యువకుడు తన 27 ఏళ్ల ప్రియురాలికి దూరమయ్యాడు.ఆ యువతి పార్టీ సందర్భంగా, ఆ యువకుడు పెంచుకుంటున్న 7 ఏళ్ల కుక్కకు చాక్లెట్ తినిపించింది.దీంతో అది అస్వస్థతకు గురయ్యింది.ఆ యువతి నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు తమ 4 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నాడు.అయితే అతని నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.ఆ యువకుడు సోషల్ మీడియాలో జరిగిన విషయాన్ని చెప్పాడు.
తన కాబోయే భార్య ఆమె ఇంట్లో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటోంది.నేను నా తల్లిదండ్రులతో కలిసి మా ఇంట్లో ఉన్నాను.కుక్కను ఆమె దగ్గర విడిచిపెట్టాను.మర్నాటి తెల్లవారుజామున 5 గంటలకు కుక్కకు అనారోగ్య సమస్య వచ్చిందని నాకు కాల్ వచ్చింది.
టాక్సీలో ఎమర్జెన్సీ పెట్ క్లినిక్‌కి వెళ్లమని చెప్పాను.కొద్దిసేపటికి నా కుక్క బతికే ఉందని వారు చెప్పారు.
కుక్క అతిగా మద్యం తాగిందని, చాక్లెట్ ఎక్కువగా తిన్నదని డాక్టర్ తెలిపారు.దీంతో ఆ యువకునికి ప్రియురాలిపై కోపం వచ్చింది.
కుక్కను పార్టీకి దూరంగా ఉంచాల్సిందని ఆ యువతికి చెప్పాడు.తరువాత తన జీవితం నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు.
వివాహం క్యాన్సిల్ అయినట్లు అతిథులకు తెలిపాడు.ఆ యువతి కుటుంబ సభ్యులు అతనిని ఒప్పించే ప్రయత్నం చేసినా అతను పెళ్లికి అంగీకరించలేదు.







