అఖండ మూవీ క్లైమాక్స్ ను చూసి ఆచార్య క్లైమాక్స్ తీశారా.. ఆ ఫీల్ రాలేదంటూ?

ఆచార్య సినిమా విడుదలకు ముందు ఆచార్య రీషూట్ల గురించి వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.అఖండ సినిమాను చూసిన తర్వాత ఆచార్య సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్టు కామెంట్లు వ్యక్తమయ్యాయి.

 Akhanda Movie Effect On Acharya Movie Details, Akhanda, Acharya Movie, Acharya M-TeluguStop.com

అయితే ఆచార్య సినిమాలో క్లైమాక్స్ ను రీషూట్ చేశారని సినిమా చూసిన ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది.ఆచార్య, అఖండ సినిమాల క్లైమాక్స్ లు కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి.

అఖండ సినిమాలో సెటప్ నే ఆచార్యలో ఫాలో కాగా ఫైట్ సీన్ కూడా దాదాపుగా అదే విధంగా ఉండటం గమనార్హం.అయితే అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఆచార్య మాత్రం ఫ్లాప్ గా నిలవడం గమనార్హం.

మరోవైపు అఖండకు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయితే ఆచార్య సినిమాకు మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ మాత్రం ప్లస్ కాలేదని కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం.

కథ విషయంలో కూడా ఆచార్య, అఖండ సినిమాలకు సంబంధించి కొన్ని పోలికలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Acharya Effect, Acharya Flop, Acharya, Acharya Climax, Akhanda Climax, Ak

రెండో రోజు నుంచి ఆచార్య సినిమా కలెక్షన్ల విషయంలో భారీ డ్రాప్ కనిపించింది.ఆచార్య సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు.జీవధార, ధర్మస్థలి, పాదఘట్టం అంటూ కొరటాల శివ చేసిన పద ప్రయోగం కూడా సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు.

Telugu Acharya Effect, Acharya Flop, Acharya, Acharya Climax, Akhanda Climax, Ak

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.ఆచార్య సినిమా నష్టాల భర్తీ బాధ్యతను ఎవరు స్వీకరిస్తారో చూడాల్సి ఉంది.దర్శకుడు కొరటాల శివ ఇన్నేళ్లలో సంపాదించుకున్న మంచి పేరును ఈ సినిమా డ్యామేజ్ చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube