సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ లుగా రాణిస్తున్న వారిని చూసి చాలామంది వాళ్ళ లైఫ్ ఎటువంటి కష్టాలు లేకుండా ఉంది అని అనుకుంటూ ఉంటారు.కానీ అలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే.
ఎందుకంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ను కొనసాగిస్తున్న ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని కొనసాగిస్తున్నారు.అలాంటి వారిలో బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన అమీర్ ఖాన్, కంగనా రనౌత్, ఇర్ఫాన్ ఖాన్ లు కూడా ఉన్నారు.
అయితే ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కెరీర్ను కొనసాగిస్తున్న వీరికి విజయం అంత ఈజీగా దక్కలేదు.వారి ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొని, కుటుంబాలను ఎదిరించి మరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేడు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు.
అలా ఫ్యామిలీని ఎదిరించి సినీ ఇండస్ట్రీ ఎంచుకున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంట్లో ఎదిరించి మరీ సినీ ఇండస్ట్రీ ఎంచుకుందట.
కంగనా రనౌత్ డాక్టర్ కావాలి అన్నది ఆమె తండ్రి కోరిక.కానీ కంగానా రనౌత్ మాత్రం చిన్నవయసులోనే ఇంటిని వదిలి వచ్చి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.

మరొక నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఒక చిన్న గ్రామం, భూస్వామ్య కుటుంబానికి చెందిన ఇతను, బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అయితే అతను ఎప్పుడూ నటుడిగా మారతారని తన కుటుంబం కలలో కూడా అనుకోలేదు అని చెప్పుకొచ్చారు.ఇక ఇతను ఇటీవలె మరణించిన విషయం తెలిసిందే.
అమీర్ ఖాన్ కూడా ఇంట్లో వారిని ఎదిరించి నటన పై ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.అయితే అమీర్ ఖాన్ ని కుటుంబ సభ్యులు ఇంజనీర్ గా చూడాలి అని అనుకున్నారట.

మరొక హీరోయిన్ కరిష్మా కపూర్. కరిష్మా సినీ ఇండస్ట్రీ ని కెరీర్ గా ఎంచుకున్నప్పుడు ఆమె తండ్రి రణధీర్ కపూర్ వద్దు అని చెప్పాడట.కానీ ఆమె తన తండ్రిని ఎదిరించి పదిహేనేళ్ల వయసులోనే బాలీవుడ్ కీ ఎంట్రీ ఇచ్చి కెరిర్ ను ప్రారంభించింది.
బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఆమె తండ్రితో పోరాడాల్సి వచ్చింది అని ఇప్పటికే పలుసార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.