సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.అయితే నిజంగా కేసీఆర్ దేశ రాజకీయాలను మారుస్తారా? ఆయనకు ఆ సత్తా ఉందా? కేసీఆర్ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతారా? లేక కెసిఆర్ చేస్తున్న కొత్త ప్రయోగంతో తెలంగాణ రాష్ట్రంలోనూ ఉనికిని కోల్పోతారా? అన్న చర్చ ప్రధానంగా సాగుతోంది.
తెలంగాణ స్వపరిపాలన సెంటిమెంటుతో కేసీఆర్ అధికారంలోకి వచ్చి పాలన సాగిస్తున్నారు.రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తుంది.ఇక ఈ సమయంలో భవిష్యత్తులో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ తాను ఎవరినో గద్దె దించడం కోసం పని చేయనని ఆయన తేల్చి చెప్పారు.
దేశానికి ఇప్పుడు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదని, ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా అంటూ వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగానే చాలామంది టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మార్చాలని అంటున్నారని కేసీఆర్ వెల్లడించారు.
అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కేసీఆర్ జాతీయ రాజకీయాలు అనవసర ప్రయోగమని వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకొందరైతే తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ప్రాభవం తగ్గిందని, ఇక ఇలాంటి సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి మళ్ళిస్తే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బాగా దెబ్బతినే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు.కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయడం మాటలు చెప్పినంత ఈజీ కాదని ఇటు రాజకీయ వర్గాలలోనూ జోరుగా చర్చ జరుగుతోంది.
పదే పదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము అని చెబుతున్న కేసీఆర్.తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యం కాలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముక్తకంఠంతో ఉద్యమిస్తే, ఎంతోమంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేస్తున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ గా మార్చి కేసీఆర్ రాజకీయాలు చేస్తే ఏ మేరకు సక్సెస్ అవుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్ప, ఇతర రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎక్కడ పోటీ చేయని, ఇతర రాష్ట్రాలలో ఎక్కడా పెద్దగా గుర్తింపు పొందని టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లోకి వెళితే సక్సెస్ సాధించడం సాధ్యమేనా అన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది.దేశంలో తుఫాను సృష్టిస్తాం అని చెబుతున్న కేసీఆర్ అన్నంత పని చేస్తారా? లేక అదే తుఫానులో పార్టీని కలిపేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ గా మార్చి కెసిఆర్ రాజకీయాలు చేస్తే ఏ మేరకు సక్సెస్ అవుతారు అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్ప, ఇతర రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎక్కడ పోటీ చేయని, ఇతర రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా గుర్తింపు పొందని టిఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లోకి వెళితే కె సి ఆర్ చెప్పినట్లు సక్సెస్ సాధించడం సాధ్యమేనా అన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతుంది.దేశంలో తుఫాను సృష్టించి దుర్మార్గాలను తరిమేస్తాం అని చెబుతున్న కేసీఆర్ అన్నంత పని చేస్తారా? లేక ఆ తుఫానులో టిఆర్ఎస్ కొట్టుకుపోయేలా చేస్తారా అంటూ రకరకాలుగా కేసీఆర్ ప్రసంగం పై ప్రజలు చర్చిస్తున్నారు.







