జాతీయ రాజకీయాలపై చాలా కాలంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే .సమయం దొరికినప్పుడల్లా వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రులను కలుస్తున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు.రాబోయే ఎన్నికల నాటికీ బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయం గా మూడో కూటమిని తెరపైకి తెచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో కేసీఆర్ ఉన్నారు.
త్వరలోనే ఆయన జాతీయ పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండగా టిఆర్ఎస్ ప్లీనరీలో దానికి సంబంధించిన సంకేతాలను కెసిఆర్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ని భారతీయ రాష్ట్ర సమితి గా మార్చాలని ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ ప్లీనరీలో ప్రకటించారు.
దీంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కాబోతున్నారనే విషయం బయటపడింది.అంతేకాక జాతీయ పార్టీ పేరు ‘ భారతీయ రాష్ట్ర సమితి ‘ గా మార్చబోతున్నారు అనే విషయం పై అందరికీ క్లారిటీ వచ్చింది.
కెసిఆర్ ప్లీనరీ లో ప్రసంగించిన సమయంలో రాజకీయ అంశాల పైన ఎక్కువగా మాట్లాడారు.బీజేపీ ని గద్దె దించడం మాత్రమే తమ లక్ష్యం కాదని ప్రకటించారు.బీజేపీ వ్యతిరేక అనుకూల ఫ్రంట్ కాదు మారాల్సింది ప్రభుత్వాలు కాదు ప్రజల జీవితాలు మార్చాలని అన్నారు.

దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని కేసీఆర్ తెలిపారు.విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకుంటున్న సమయంలో వెలుగు జిలుగుల తెలంగాణ ను ఏర్పాటు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.ఎందరో మహానుభావులు గొప్ప వాళ్ళు పార్టీకి అంకితమై పని చేసే నాయకుల సమాహారమే ఈ ఫలితాలకు కారణమని కేసీఆర్ అన్నారు.
ప్రజా సమస్యల ఇతివృత్తంగా పని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుని పొంగిపోవడం లేదని, వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం అంటూ కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
.






