టాలీవుడ్ కు పెద్ద మైనస్ అదే.. భయపడుతున్న స్టార్ డైరెక్టర్లు?

మొన్నటి వరకూ టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు పైరసీ బెడద ఎక్కువగా ఉండేది.సినిమా ఇలా థియేటర్లలో విడుదలైందో లేదో అప్పుడే పైరసీ గాళ్ళు సోషల్ మీడియాలో సినిమా మొత్తాన్ని విడుదల చేయడం లాంటివి చేస్తూ ఉండేవారు.

 This Is The Biggest Minus For Tollywood Movies , Tollywood Movies , Tollywood-TeluguStop.com

దీంతో కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసిన నిర్మాతలకు ఎన్నో కష్టాలు వచ్చేవి.కానీ ఇటీవలి కాలంలో మాత్రం పైరసీ గాళ్ళకు అంటే లీక్ వీరుల బెడద ఎక్కువైపోయింది.

సినిమాలోని కీలకమైన సన్నివేశాలను లీక్ చేస్తూ ఉన్న కారణంగా ఇక ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గిస్తూ ఉంటారు.ఇలా ఇటీవలి కాలంలో అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి ఏదో కంటెంట్ బయటకి వస్తూనే ఉంది.

ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్ని కూడా చిత్రబృందం కంటే ముందే సోషల్ మీడియాలో విడుదల చేస్తూ షాక్ ఇస్తున్నారు లీక్ వీరులు.ఇక సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేయడమే ఆలస్యం ఒక వెంటనే ఆ కంటెంట్ ఏంటి అన్నది సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది.

దీనిపై ఎన్ని సార్లు హెచ్చరించి లీక్ వీరులు రెచ్చిపోతున్నారు తప్ప ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా లేదా ఇంకేదైనా ఉద్దేశంతో చేస్తున్నారా అన్నది పక్కన పెడితే లీకుల బెడద మాత్రం చిత్ర బృందానికి వరుసగా షాపులు ఇస్తూనే ఉంది.

Telugu Piracy, Producers, Dirctors, Teaser Trailer, Tollywood-Telugu Stop Exclus

అయితే లీక్ రాయుళ్ల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలుమార్లు లీక్ రాయుళ్లను హెచ్చరించారు.పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.ఇక ఇంత జరిగినా అటు లీకులు మాత్రం ఎక్కడా బయట పడటం లేదు.ఒక పెద్ద సినిమాలోని సాంగును టీజర్ను ట్రైలర్ షెడ్యూల్ చేసిన సమయానికంటే ముందే బయటకు వదిలేస్తున్నారు.

ఇక ఇటీవల లేటెస్ట్ గా మరో పాట కూడా లీక్ అయింది.దీంతో ఇదంతా లీక్ రాయుళ్ల పని అని అర్థమవుతుంది.కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఎందుకు ఈ లికు రాయుళ్ల నుంచి జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు అన్నది అర్థం కాని పరిస్థితి.తన అభిమాన హీరోల రికార్డులను బ్రేక్ చేయకూడదని ఇలాంటివి చేస్తున్నారని.

మరోవైపు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడం కోసం ఇలా చేస్తున్నారు అని మరో టాక్ ఉంది.అయితే ఇలాంటి లీకులు ఎప్పుడూ సినిమాకు ప్లస్ అవుతాయన్నది కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube