తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు సర్వసాధారణంగా మారిపోయాయి.ఎప్పుడూ సీనియర్ నాయకుల మధ్య ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది.
రేవంత్ నాయకత్వంలో పని చేయడం ఏమిటనే అభిప్రాయం సీనియర్ నాయకులలో ఉండటం తో తరచుగా విభేదాలు రావడం , దీనిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు అందుతూ ఉండడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి.తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో రాహుల్ గాంధీ ఇటీవలే సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా నేతలంతా ఇకపై ఐక్యంగా ఉంటూ , పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామనే హామీని ఇచ్చారు.కొద్ది రోజుల పాటు ఈ వ్యవహారం బాగానే నడిచినా, ఇప్పుడు మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.
రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన సన్నాహక సమావేశానికి సీనియర్లు ఆసక్తి చూపించకపోవడం తో రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన వాయిదా పడింది.
అలాగే దీనికి సంబంధించిన షెడ్యూల్, సభ వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదు .ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం సన్నాహక సమావేశాన్ని వ్యతిరేకిస్తుండగా , జానా రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయులు ఆహ్వానిస్తున్నారు.దీంతో రేవంత్ వర్గీయులు రేపు సమావేశం నిర్వహిస్తామని చెబుతున్నారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉంది.అయితే ఇప్పుడు అది వాయిదా పడినట్లు కాంగ్రెస్ కమిటీ తెలిపింది.
జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేవంత్ పర్యటనను వ్యతిరేకిస్తుండడంతో ఇది వాయిదా పడినట్లు సమాచారం.

మే ఆరో తేదీన వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కరీంనగర్ ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి జిల్లాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే ఆయన సోమవారం కరీంనగర్ లో పర్యటించారు.
ఉమ్మడి కరీంనగర్ కు చెందిన నాయకులు పార్టీ శ్రేణులు ఆయనతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి భట్టి విక్రమార్క , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వంటివారు హాజరయ్యారు.
కానీ నల్గొండ పర్యటన విషయంలోనే వివాదం అలుముకుంది.
.






