సియం కేసిఆర్ కు ఓటమి భయం వెంటాడుతోంది.అందుకే ప్రశాంత్ కొషోర్ జపం చేస్తున్నారు.
బిజేపి ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎంపి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు.కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిజేపి ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎంపి వివేక్ వెంకట స్వామి.
ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చేల్లించుకున్నారు.దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
దర్సన అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు.తెలంగాణాలో ప్రజలు మంచి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది, బిజేపి గెలుపు ఖాయమైంది.అందుకే కేసిఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసిఆర్ ఆన్నారు.ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలనుకుంటున్నారని కేసిఆరే విమర్శించారు.ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారంటే కేసిఆర్ ఓడిపోయినట్టు ఒప్పుకుంటున్నారు.అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు.
తెలంగాణాలో వరుస ఎన్నికలలో బిజేపికే ప్రజలు పట్టం కడుతున్నారు….







