విద్య కొరకు అధిక బడ్జెట్ కేటాయించాలి

యాదాద్రి జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలను మనఉరు-మనబడి పథకంలో అభివృద్ధి చేయాలని ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్ రెడ్డి కోరారు.శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన విద్యా ఉద్యమం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్టడారు.కోవిడ్-19 కాలంలో చాలామంది విద్యార్థులు బడికి దూరం అయ్యారని,చదువులు మరిచిపోయి వివిధ పనులలో నిమగ్నమైన విద్యార్థులను తిరిగి బడులకు తీసుకురావాలని,బడికి వచ్చిన విద్యార్థులు తరగతులు మారిన చదువు మాత్రం నేర్పలేదని,ఆ పిల్లలందరికీ రీమిడిఎల్ తరగతులు నిర్వహించి తరగతికి తగ్గ చదువు నేర్పాలని,అందుకు ప్రభుత్వం ఈ వేసవిలో ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు.రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థి 8వ తరగతి వచ్చినా, విద్యను పొందడంలో ఎటువంటి లాభం జరగలేదని ప్రభుత్వం చేపట్టిన’మనఊరు-మనబడి’కార్యక్రమం అన్ని బడులలో ప్రారంభించాలని ఆయన కోరారు.

 A Higher Budget Should Be Allocated For Education-TeluguStop.com

ప్రతి గ్రామ పంచాయతీకి 25% బడ్జెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జాతీయ,రాష్ట్ర నాయకులు ధనసిరి ప్రకాష్,వివి రావు,ఎర్ర శివరాజు, కొడారి వెంకటేష్,సురుపంగ శివలింగం,బొక్క రాంబాయి,ఆవుల వినోద్ కుమార్,ఒగ్గు క్రిస్టఫర్, హీరాలాల్,బాలరాజ్ గౌడ్,చంద్రశేఖర్ రెడ్డి,సోమ నరసయ్య,పురుషోత్తంరెడ్డి,నలమాసు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube