పురుషుల కంటే స్త్రీలకు తలనొప్పి ఎందుకు ఎక్కువగా వస్తుందంటే..

పురుషుల కంటే మహిళల్లో తలనొప్పి, మైగ్రేన్ కేసులు అధికంగా కనిపిస్తాయి.దీనిపై తరచూ చర్చలు జరగుతుంటాయి.

 Why Women Suffers More Headaches Details, Women, Headaches, Migraine, Migraine I-TeluguStop.com

శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో ఇందుకు కారణాన్ని వెల్లడించారు.ప్రపంచంలోని 6 శాతం మంది మహిళలు నెలలో 15 రోజులలో తలనొప్పి, మైగ్రేన్‌తో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.అయితే ఈ సంఖ్య పురుషులలో 2.9 శాతం మాత్రమే.అదే సమయంలో మైగ్రేన్ విషయంలో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది.నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ వివరాలు తెలియజేశారు.17 శాతం మంది మహిళలు మైగ్రేన్‌తో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

అదే సమయంలో ఇది 8.6 మంది పురుషులలో కనిపించింది.మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి.

ఇలా జరిగినప్పుడు తలకు ఒకవైపు నొప్పి వస్తుంది.ఈ తలనొప్పి ప్రభావం కంటి చూపుపై కూడా ఉంటుంది.

మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు కాంతి, శబ్దానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.ఇలాంటి కేసులు మహిళల్లో ఎందుకు ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు అర్థం చేసుకుందాం.

మహిళల్లో హార్మోన్ల మార్పులే ఇందుకు ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు.ఈస్ట్రోజెన్ హార్మోన్‌లో హెచ్చుతగ్గులు అటువంటి నొప్పికి దారితీస్తాయి.

ఎవరైనా సరే తలనొప్పిని తీవ్రంగా పరిగణించాలని పరిశోధకులు అంటున్నారు.

Telugu Eye, Harmone, Headaches, Migraine, Nowegian-Latest News - Telugu

మహిళలు తలనొప్పిని ఎదుర్కొంటున్నప్పుడు వారు ఇంట్లో, కార్యాలయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.పరిశోధకుడు లార్స్ జాకబ్ తెలిపిన వివరాల ప్రకారం పురుషుల కంటే స్త్రీలలో తలనొప్పి ఎక్కువ కాలం ఉంటుంది.ఇది నెలలో 15 రోజుల వరకు ఉంటుంది.

అందుకే దీనికి కారణాలను కనుగొనడం, మెరుగైన చికిత్సను అందించడం చాలా.ఎందుకంటే మహిళలకు ఎక్కువ బాధ్యతలు చేపడుతుంటారు.

ఇటువంటి అనారోగ్య పరిస్థితులను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube