తిరుమలలో సామాన్య భక్తుడికి సకల సదుపాయాలు కల్పించాలని టీటీడీని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈరోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేసవిలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందనీ, తిరుమలలో ఎండలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భక్తులు ఎండలకు ఇబ్బంది పడకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరారు.







