పోలీస్ ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గంజాయి నిర్మూలన మరియు సారాయి నిషేధం పై అవగాహన సదస్సు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో గంజాయి నిర్మూలన మరియు సారాయి నిషేధం పై అవగాహన సదస్సు.

 Awareness Seminar On Cannabis Eradication And Alcohol Ban As Part Of Police Ope-TeluguStop.com

ఈ సదస్సులో G మాడుగుల SI గారు మాట్లాడుతూ రాబోయే జూన్, జూలై కాలం గంజాయి పంటకి అనుకూలం కాబట్టి ముందుగా గంజాయి పంట పండించటం నేరం అని తెలియచేశారు, అదే విధంగా గంజాయి రవాణా, అమ్మటం, కొనడం కూడా నేరం అని తెలియజేసి గ్రామ పెద్దలకు ఒక ముందస్తు నోటీస్ సర్వ్ చేశారు.మీ ఊర్లో సారాయి తయారు చేయటం గాని అమ్మడం గాని తాగి గొడవ చేయడం గాని ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదనీ అవన్నీ చట్టరీత్యా నేరం అని తెలియచేశారు.

అదేవిధంగా ఒక ప్రక్క దిశ యాప్ ని డౌన్లోడ్ చేసి మహిళలకు మేమున్నామని భరోసా ఇస్తూ, మరోపక్క విద్యార్థినీ విద్యార్థులకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కి ఎగ్జామ్ మెటీరియల్స్ అందిస్తున్నా అల్లూరి సీతారామరాజు పోలీసులు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతి గిరిజన గ్రామ ప్రజలకు మేమున్నామని 24 x7 భరోసా ఇస్తున్నారు జిల్లా పోలీసులు.

ఈ కార్యక్రమంలో జి మాడుగుల ఎస్సై గారు, గ్రామపెద్దలు, సచివాలయ సిబ్బంది మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube