ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ వరుస విజయాలతో కళకళలాడుతున్న సంగతి తెలిసిందే.అఖండ, పుష్ప, బంగార్రాజు, భీమ్లా నాయక్, కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి జోష్ ఇచ్చాయి.
అయితే అఖండ, కేజీఎఫ్2 సినిమాలు సక్సెస్ కావడానికి ఒకటే కారణమని ఈ రెండు సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
అఖండ, కేజీఎఫ్2 సినిమాలలో ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ హైలెట్ గా నిలిచింది.
ఈ రెండు సినిమాలలో హీరోలకు ఇచ్చిన ఎలివేషన్లు ఈ సినిమాలు సక్సెస్ సాధించడానికి ఒక విధంగా కారణమయ్యాయి.ఈ సినిమాలలోని యాక్షన్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుల అంచనాలను మించి ఉన్నాయనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ఈ రెండు సినిమాల్లో హీరోలను పవర్ ఫుల్ గా చూపించడంతో పాటు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని పాత్రలలో దర్శకులు చూపించారు.

సూపర్ హీరోలలా ఈ సినిమాలలో హీరోలను చూపించడం కూడా ఈ సినిమాలు సక్సెస్ కావడానికి కారణమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యకమవుతున్నాయి.కేజీఎఫ్2 సినిమా బాలీవుడ్ లో అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తుండగా అఖండ బాలీవుడ్ లో డబ్ అయ్యి ఉంటే అక్కడ కూడా సంచలన విజయం సాధించేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అఖండ సినిమాలో భక్తికి ప్రాధాన్యత ఉండటంతో భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
మరి బాలకృష్ణే వద్దన్నారో లేక అఖండ మేకర్స్ నో చెప్పారో తెలియదు కాబట్టి అఖండ మేకర్స్ మాత్రం బాలీవుడ్ విషయంలో వెనుకడుగు వేసి తప్పు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలకృష్ణ అఖండ ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.







