కియారా అద్వానీ.ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.
ఈమె తెలుగులోకి కూడా అడుగు పెట్టి ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా కియారా అద్వానీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఈ సినిమాతో ఈ అమ్మడు సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత ఈమెకు రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం వచ్చింది.
అయితే ఈ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు.కానీ రామ్ చరణ్, కియారా జోడీకి మంచి మార్కులు పడ్డాయి.అందుకే వీరిద్దరి జోడీ మరోసారి తెరమీద కనిపించ నుంది.శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకున్నారు.ఇక దీంతో ఈమె పేరు మారుమోగి పోయింది.శంకర్ సినిమాలో హీరోయిన్ లకు కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది.
ఈ సినిమాలో కూడా కియారకు రొమాంటిక్ టింజ్ తో పాటు కథలో కీలక పాత్ర ఉంటుందట.అందుకే కియారాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని టీమ్ చెబుతుంది.ఇక ఇది పక్కన పెడితే తాజాగా అమ్మడు లుక్ పూర్తిగా చేంజ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

ఎప్పుడు బయట కనిపించిన వేడెక్కించే లుక్ లో హాట్ గా కనిపించే ఈ అమ్మడు ఈసారి మాత్రం సాదా సీదాగా సమ్మర్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సీజనల్ గా సౌకర్యంగా ఉండేందుకు డ్రెస్సింగ్ స్టయిల్ మార్చేసింది.ఈమె కుర్తా సూట్ ను ధరించి దర్శనం ఇచ్చింది.
అయితే ఈమె ఈ సూట్ లో కనిపించడానికి ఒక కారణం ఉంది.స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ఈమె ఈ డ్రెస్సింగ్ స్టయిల్ ను పాటించింది.
ఈమె లుక్ అందరిని ఆకట్టుకుంది.







