మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా అనంతరం తదుపరి తన చిత్రాల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన15 వ చిత్ర నిర్మాణంలో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పంజాబ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ అమృత్ సర్ లోని ఖాసా ప్రాంతాన్ని సందర్శించారు.అక్కడ ఉన్న బీఎస్ఎఫ్ క్యాంపుకు వెళ్లి జవాన్లతో సరదాగా కాసేపు ముచ్చటించారు.
అనంతరం జవాన్ల కోసం ప్రత్యేక విందు తయారు చేయించే వారితోపాటు కలిసి భోజనం చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక రామ్ చరణ్ అమృత్ సర్ లోషూటింగ్ లో బిజీగా ఉండగా ఆయన సతీమణి ఉపాసన రామ్ చరణ్ తరపున గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక రామ్ చరణ్ తన 15 వ చిత్రంలో ద్వి పాత్రాభినయంలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ పాత్రలో సందడి చేస్తున్నారు.ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.







