తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే ఒకప్పుడు ఈ సీరియల్ ఎప్పుడు ఎప్పుడు ప్రసారం అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పనులను పక్కన పెట్టేసి మరీ ఎదురు చూస్తూ ఉండేవాడు.
కానీ రాను రాను ప్రేక్షకులు ఈ సీరియల్ ని చూడటమే మానేశారు.అంతేకాకుండా ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ అంటేనే చాలామంది బోరింగ్ సీరియల్ అంటటూ కార్తీకదీపం సీరియల్ వారిని తిట్టిపోస్తున్నారు.
ఒకప్పుడు డాక్టర్ బాబు వంటలక్క ఎప్పుడెప్పుడు కలుస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
కానీ తీరా డాక్టర్ బాబు, వంటలక్క కలిసిన తరువాత వారిని కలిపినట్లే కలిపి వారిద్దరిని చంపేసి, నెక్స్ట్ జనరేషన్ అంటూ కొత్త కొత్త వాళ్ళని రప్పించి కొత్త కథను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక ప్రస్తుతం అక్క చెల్లెల కథతో కార్తీకదీపం సీరియల్ సాగదీస్తున్నారు.దీప, కార్తీక్ ల చావుకు హిమ కారణం అని సౌర్య అని హిమ పై పగ పడుతుంది.
ఇక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సౌర్య ఆటోడ్రైవర్ గా మారుతుంది.మరొకవైపు హిమ డాక్టర్ గా మారుతుంది.
చాలా కాలం తరువాత హిమ, సౌర్య ఆచూకీ తెలుసుకుంటుంది.ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో జ్వాలా, హిమ, నిరూపమ్, ప్రేమ్ లు అంటూ కొత్త జనరేషన్ ను తీసుకువచ్చి వారి చుట్టూ కథను సాగదీస్తూ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే ఇందులో సౌర్య(జ్వాలా ) కీ స్వప్న కి అసలు పడదు.

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో జ్వాలా కి స్వప్న కి మధ్య గొడవ జరగడంతో జ్వాలా పై కోపంతో రగిలి పోతున్న స్వప్న ఆటోకీ నిప్పు పెట్టేసింది.అది చూసిన జ్వాలా కుమిలి కుమిలి ఏడుస్తుంది.అయితే ఈ సన్నివేశాన్ని చూసిన ఆటోడ్రైవర్లు చాలా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
దీంతో వెంటనే ఆటో యూనియన్ రంగంలోకి దిగాయి.ఆటోలు తగలబెట్టే ప్రోమోను స్టార్ మా ఫేస్బుక్ లో వదలగా ముందు ఆ సన్నివేశాన్ని సీరియల్ నుంచి డిలీట్ చేయకపోతే మొత్తం తగలబెట్టేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తూ కామెంట్ రూపంలో హెచ్చరిస్తున్నారు ఆటో డ్రైవర్స్.
మరి ఈ విషయం పై కార్తీక దీపం యూనియన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.మరి ఆటోడ్రైవర్ లు చెప్పిన విధంగా కార్తీకదీపం సీరియల్ లో ఆ సన్నివేశాన్ని డిలీట్ చేస్తారా లేదా చూడాలి మరి.







