కెనడాలో ఆగంతకుడి కాల్పుల్లో మరణించిన భారతీయ విద్యార్ధి కార్తీక్ వాసుదేవ్ అంత్యక్రియలు అతని స్వగ్రామం ఘజియాబాద్‌లో శనివారం పూర్తయ్యాయి.కెనడా నుంచి అతని మృతదేహం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
కార్తీక్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు స్వీకరించి ఘజియాబాద్ రాజేంద్ర నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు.అనంతరం హిండన్ నది ఒడ్డున అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అయితే ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఘజియాబాద్‌కు తన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు స్థానిక యంత్రాంగం ఎలాంటి సాయం అందించలేదని కార్తీక్ తండ్రి జితేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.అలాగే తమ కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక పరిపాలనా ప్రతినిధి ఎవరూ స్మశాన వాటికకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు,.
ఏప్రిల్ 7న టొరంటోని సెయింట్ జేమ్స్ టౌన్‌లోని షెర్‌బోర్న్ టీటీసీ స్టేషన్ సమీపంలోని గ్లెన్ రోడ్ ఎంట్రన్స్ వద్ద కార్తీక్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.దీంతో తీవ్ర గాయాలపాలై కుప్పకూలిన కార్తీక్‌కు ఆఫ్ డ్యూటీలో వున్న పారామెడిక్ ఒకరు ప్రథమ చికిత్స అందించి.
హుటాహుటీన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశాడు.

కార్తీక్ తండ్రి జితేష్ వాసుదేవ్.తల్లి పూజాతమ బిడ్డ కెనడా వెళ్లాలని ఎంతగా శ్రమించింది వారు గుర్తుచేసుకున్నారు.పదవ తరగతిలో వున్నప్పుడే కెనడా వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్పారు.
ఈ క్రమంలోనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు కార్తీక్ ఈ ఏడాది జనవరి 4న కెనడాకు వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు.టొరంటోలోని సెనెకా కాలేజీలో చేరిన కార్తీక్.ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరవుతున్నాడు.10, 12 తరగతులు, గ్రాడ్యుయేషన్‌లో కార్తీక్ మంచి మార్కులు సాధించాడని అతని తండ్రి జితేష్ వాసుదేవ్ తెలిపారు.గతేడాది డిసెంబర్‌లోనే కెనడా వెళ్లాల్సి వుందని.విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడని, కానీ వీసా దొరకకపోవడంతో వీలు కాలేదని జితేష్ చెప్పారు.కొన్ని రోజుల తర్వాత వీసా రావడంతో మరోసారి ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని జనవరి 4న కెనడాకు బయల్దేరాడని ఆయన గుర్తుచేసుకున్నారు.







