ఆ కారణం వల్లే డ్రగ్స్ తీసుకున్నా.. సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

కేజీఎఫ్2 సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి కారణమైన వ్యక్తులలో సంజయ్ దత్ ఒకరు.అధీరా పాత్రకు సంజయ్ దత్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

 Sanjay Dutt Reveals He Started Doing Drugs Become Cool And Impress Women Details-TeluguStop.com

చిన్నపిల్లలు సైతం భయపడేలా పవర్ ఫుల్ విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించారు.ఈ పాత్ర వల్ల సంజయ్ దత్ నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కారనే చెప్పాలి.బాలీవుడ్ లో స్టార్ హీరో అయినప్పటికీ సంజయ్ దత్ కథ నచ్చితే విలన్ రోల్స్ లో కూడా నటించడానికి ఓకే చెబుతున్నారు.

కేజీఎఫ్2 సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో వరుసగా ఇంటర్యూలు ఇస్తున్న సంజయ్ దత్ ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.సంజయ్ దత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను సైతం ఫ్యాన్స్ తో పంచుకున్నారు.తనకు డ్రగ్స్ ఏ విధంగా అలవాటు అయ్యాయో కూడా సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.

అమ్మాయిలతో మాట్లాడాలని అనుకుంటే అప్పట్లో చాలా సిగ్గుపడేవాడినని సంజయ్ దత్ వెల్లడించారు.

అయితే ఎలాగైనా అమ్మాయిలతో మాట్లాడాలని తనకు అనిపించేదని సంజయ్ దత్ పేర్కొన్నారు.

Telugu Adheera, Bollywood, Drugs, Yash, Kgf Chapter, Kgf, Prasanth Neel, Sanjay

ఆ సమయంలో డ్రగ్స్ ను వినియోగించడం వల్ల కూల్ గా కనిపిస్తానని అనుకున్నానని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.అమ్మాయిలతో మాట్లాడే ఛాన్స్ సులువుగా వస్తుందని భావించి డ్రగ్స్ తీసుకున్నానని సంజయ్ దత్ అన్నారు.అయితే డ్రగ్స్ కు అడిక్ట్ అయిన తర్వాత ఎంతో ఇబ్బంది పడ్డానని ఆయన వెల్లడించారు.

Telugu Adheera, Bollywood, Drugs, Yash, Kgf Chapter, Kgf, Prasanth Neel, Sanjay

తాను ప్రపంచానికి దూరంగా ఒంటరి లైఫ్ గడిపేవాడినని గదిలో లేదా బాత్ రూమ్ లో ఉండేవాడినని సంజయ్ దత్ అన్నారు.కోలుకోవడం కొరకు రిహబిలిటేషన్ సెంటర్‌ కు కూడా వెళ్లానని సంజయ్ దత్ కామెంట్లు చేశారు.తనపై ఏర్పడిన మచ్చను చెరిపేసుకోవాలని బాడీ బిల్డ్ చేసుకున్నానని ఆయన అన్నారు.

ప్రస్తుతం తనకు ప్రశంసలు దక్కుతున్నాయని సంజయ్ దత్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube