అక్కడి ప్రజలు స్లో పాయిజన్ బాధితులు!

రాజస్థాన్‌లోని భివాడి ట్రాఫిక్ పోలీసు సురేంద్ర సింగ్ తన చొక్కా విప్పాడు.దుమ్ము, ధూళిని దులిపాడు.

 World Most Polluted City Bhiwadi Pollution , W.h.o , Bhiwadi , Surendra Singh ,-TeluguStop.com

అతని ఛాతీకి అమర్చిన చిన్న పెట్టెను చూపించాడు.తరువాత అతను మాట్లాడుతూ.

ఇది నన్ను సజీవంగా ఉంచుతోంది… అని అన్నాడు.సురేంద్రకు 48 ఏళ్లు.

అతని ఛాతీ దగ్గర వేలాడుతున్న పరికరం పేరు కార్డియాక్ డిఫిబ్రిలేటర్.అతని గుండె అసాధారణంగా కొట్టుకున్నప్పుడు ఈ పరికరం విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేయడం ద్వారా అతని హృదయ స్పందనను నియంత్రిస్తుంది.అతను ఇంకా మాట్లాడుతూ.‘ఈ నగరంలో పని చేయడానికి నేను చెల్లిస్తున్న మూల్యం ఇది’ అని వాపోయాడు.ఇటీవల స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAir మొత్తం 6,475 నగరాల్లో గాలి నాణ్యతను సర్వే చేసింది.వీటిలో పారిశ్రామిక కేంద్రం భివాడి అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్లు వెల్లడయ్యింది.

ప్రపంచంలోనే అత్యంత కలుషిత ప్రాంతంగా భివాడి గుర్తింపు పొందింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఈ నగరంలోని గాలిలో 20 రెట్లు అధికంగా కలుషిత గాలి కణాలు ఉన్నాయి.వీటిని PM2.5 అంటారు.ఈ కణాలు ఊపిరితిత్తులు, హృదయనాళ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి.ఎక్కువసేపు కలుషిత గాలికి గురికావడం వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.రక్తంలో ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది.ఇది క్రమరహిత హృదయ స్పందనలకు దారి తీస్తుంది, ఛాతీ నొప్పికి దారితీస్తుంది.

ట్రాఫిక్ పోలీస్ సురేంద్ర సింగ్ అస్వస్థతకు గురి కావడానికి కూడా ఇదే కారణం.అతను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటాడు.

అలాగే ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోడు.సురేంద్ర సింగ్ మాట్లాడుతూ చాలాకాలంగా తాను పొగ, దుమ్ము, విషపూరిత పారిశ్రామిక గాలిని పీల్చడం వల్ల దగ్గు, శ్వాసలోపం,ఛాతీ నొప్పితో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube