థియేటర్లో చీకటి వాతావరణంలో సినిమాను ఎలా చూస్తుంటామో, అదే విధంగా ఇంటిలోని గదిలో కిటికీలు, తలుపులు మూసేసి, చీకటి వాతావరణంలో టీవీ చూస్తే మరింత మజా వస్తుందని కొందరు భావిస్తుంటారు.దీంతో టీవీలోని సినిమాను మరింత స్పష్టంగా, మెరుగ్గా అనుభూతి చెందవచ్చని అనుకుంటారు.
కానీ ఇటువంటి ఆలోచన పూర్తిగా తప్పు.మనం ఇలా చేయడం వలన మనకు హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి మన కళ్ళు కాంతి సమక్షంలో ఏదైనా వస్తువును మరింత స్పష్టంగా చూడగలవు.అందువల్ల టెలివిజన్ చూస్తున్నప్పుడు గదిలో కాంతిని ఉండటం చాలా అవసరం.
అయితే కాంతి కిరణాలు నేరుగా టీవీ తెరపై పడకూడదని గుర్తుంచుకోండి.చీకటి గదిలో టీవీ చూడటం హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.

చీకట్లో టీవీ స్ర్కీన్ నుంచి వచ్చే వెలుతురుకు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి.మీరు చీకటి గదిలో కూర్చుని టీవీని చూస్తున్నప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.కళ్లపై దీని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది.చీకటి గదిలో టీవీ చూడటం, దాని స్క్రీన్‌పై కదిలే చిత్రాలతో, దాని కాంతి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
కళ్లు వాటిని సర్దుబాటు చేయలేకపోతాయి.ఒత్తిడికి గురవుతాయి.
అందువల్ల మీరు ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు, గదిని పూర్తిగా చీకటిగా ఉంచవద్దు.కాస్త వెలుతురు వచ్చేలా ఉంచండి.
టీవీకి కనీసం 3-4 మీటర్ల దూరంలో కూర్చుంటే బాగుంటుంది.టీవీ ఎత్తు కూడా కనీసం నాలుగు అడుగులు ఉండాలి, టీవీ చూసేటప్పుడు కళ్లు కిందికి వంగి ఉండకూడదు.
ఇప్పుడు ల్యాప్‌టాప్ గురించి మాట్లాడుకుందాం.చాలా మంది చీకటిలో కూర్చొని ల్యాప్‌టాప్‌తో పని చేస్తుంటారు.
అలాగే దానితో గంటల తరబడి గడుపుతుంటారు.చీకటిలో కూర్చుని టీవీ చూడటం కంటే ఇది చాలా హానికరం.
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్‌లను మనం ఈ విధంగా వినియోగిస్తే కంటి చూపునకు హాని చేసుకున్నవారం అవుతాం.







