సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటోల వెనుక, ట్రక్కులు, లారీల వెనుక రకరకాల కొటేషన్లు రాసి ఉండడం మనం చూసే ఉంటాము.అయితే వాటిలో కొన్ని కొటేషన్స్ అందరిని ఆలోచింపచేసేలా ఉంటాయి.
;మరికొన్ని మాత్రం కాస్త భిన్నంగా, ఫన్నిగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రక్ మీద రాసి ఉన్న కొటేషన్ ఒకటి అందరిని ఆలోచింపచేస్తుంది.
ఈ ఫోటోను షేర్ చేసింది ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్రా ఈ ఫొటోను తీసి తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో పాటు దానికి బ్రిలియంట్ అంటూ కూడా క్యాప్షన్ పెట్టారు.
వివరాల్లోకి వెళితే.ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలెంట్ ఉన్నవాళ్ళని ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ముందు ఉంటారు.ఈ క్రమంలోనే ఆనంద్ మహీంద్రా చూపు ఒక ట్రక్ వెనుక రాసి ఉన్న ఒక కొటేషన్ మీద పడింది.

ఇంతకీ ఆ కొటేషన్ ఏంటో చూద్దామా.“టెస్ట్ యువర్ ఎయిర్‌బ్యాగ్ హియర్ (మీ ఎయిర్‌బ్యాగ్ ను ఇక్కడ పరీక్షించుకోండి)” అని ట్రక్ వెనుక రాసి ఉంది.ఇలా ప్రతి ట్రక్ వెనుక రాసి ఉంచడం చాలా బెటర్ పని అని అతను చాలా బ్రిలియంట్ అంటూ ఆ లారీ ఓనర్ కు ఆనంద్ మహీంద్రా కాంప్లిమెంట్ ఇచ్చారు.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అందరు తమదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.







