మెగా డాటర్ శ్రీజ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వార్తలలో పెద్ద ఎత్తున నిలుస్తున్నారు.అందుకు గల కారణం కేవలం తన సోషల్ మీడియా ఖాతాలలో శ్రీజ కళ్యాణ్ దేవ్ గా ఉన్న తన పేరును శ్రీజ కొణిదెలగా మార్చుకున్నారు.
అప్పటినుంచి శ్రీజ కళ్యాణ్ విడాకులు తీసుకోబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే వీరి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఈ విషయంపై మెగా కుటుంబం స్పందించలేదు.
ఇలా వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ వాటి గురించి పట్టించుకోకుండా ఒకవైపు శ్రీజ, మరోవైపు కళ్యాణ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేస్తున్నారు.అయితే వీరు చేసిన పోస్టులు క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా శ్రీజ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

శ్రీజ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పోస్ట్ చేస్తూ… మనం ఇతరులకు ఏదైతే ఇస్తామో మనకు అదే వందరెట్లు తిరిగి వస్తుందంటూ శ్రీజ పోస్ట్ చేశారు.ప్రస్తుతం శ్రీజ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ పోస్టు చూసి అసలు శ్రీజ చేసిన ఈ పోస్ట్ వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు? అంటూ సందేహాలు వ్యక్తం చేయగా… మరికొందరు మాత్రం తన భర్త కళ్యాణ్ దేవ్ నుఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేసిందా? అంటూ కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి శ్రీజ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







