పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ కాదు.. ఆమె సినీ హిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది.

 Pooja Hegde Iron Leg Or Golden Leg , Pooja Hegde , Tollywood , Iron Leg , Gold L-TeluguStop.com

పూజా హెగ్డే మొదట 2012లో ముగమూడి అనే ఒక తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింద.ఆ సినిమా పరాజయం పాలవడంతో తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

ఆ తరువాత ఒక లైలా కోసం,ముకుంద సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవడంతో బాలీవుడ్ బాట పట్టింది.

Telugu Allu Arjun, Aravindasametha, Gaddalakonda, Gold Led, Iron Leg, Maharshi,

అక్కడ మొహంజోదారో ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిపోవడంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది.అలా తెలుగులో అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించింది.ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే దిశ మారిపోయింది ఈ సినిమాతో పూజా హెగ్డే పేరు బుట్ట బొమ్మ గా కూడా మారిపోయింది.

ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ,మహర్షి, గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురములో ఇలా వరుస సినిమాల్లో నటించింది.

ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పూజా ఫుల్ హీరోయిన్ గా మారింది.

Telugu Allu Arjun, Aravindasametha, Gaddalakonda, Gold Led, Iron Leg, Maharshi,

ఇకపోతే ఇటీవలే పూజా హెగ్డే రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన విషయం తెలిసిందే.అలాగే ఈ నెలాఖరులో విడుదల కానున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటించింది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

పనిలోపనిగా కోలీవుడ్ లో కూడా పాగా వేయాలని భావించినట్లు తెలుస్తోంది.పోతే పూజాహెగ్డే కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తే ఒక సినిమా హిట్‌ అయితే రెండు చిత్రాలు ఫెయిల్‌ అవ్వడం, మరో చిత్రం యావరేజ్‌గా ఆడడం జరిగింది.

కాబట్టి పూజా హెగ్డే ది పూర్తిగా గోల్డెన్‌ లెగ్‌ అని అన చెప్పలేము.అలాగని ఐరెన్‌ లెగ్‌ అని కూడా చెప్పలేము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube