ఐపీఎల్ 2022 టోర్నీ ప్రారంభమైన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతోంది.నిన్న అంటే శుక్రవారం నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా 54 పరుగులతో చెలరేగగా.ఆండ్రీ రసెల్ 49 పరుగులు చేశాడు.
దీంతో కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.అయితే హైదరాబాద్ ఆటగాళ్లలో ఒకరైన రాహుల్ త్రిపాఠి 71 పరుగులు చేయగా, మర్‌క్రమ్ 68 పరుగులు అలవోకగా చేశాడు.దీంతో హైదరాబాద్ జట్టు కేవలం 17.5 ఓవర్లలోనే 176 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.ఈ 2022 సీజన్‌లో ఐదో మ్యాచ్ ఆడిన హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్ లలో గెలుపొందింది.
ఐపీఎల్ 2022లో ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై 61 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు అపజయం పాలయ్యింది.
రెండో మ్యాచ్‌లో కూడా 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై ఓడింది.ఇక ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇది విజయ కేతనం ఎగుర వేస్తూ తమ సత్తా ఏంటో చాటుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్స్ పై హైదరాబాద్ టీమ్ భారీ విజయాన్ని నమోదు చేసింది.అయితే ఈసారి హైదరాబాద్ టీమ్ లో చాలామంది ప్లేయర్లు మారారు.వీరంతా కూడా కుర్ర ప్లేయర్లే కావడం విశేషం.వీరితో ఈ సారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని హైదరాబాద్ ఫ్రాంచైజీ భావిస్తోంది.మరి వారి కల నెరవేరుతుందో లేదో చూడాలి.







