ఎఫ్‌.3 చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్ షూటింగ్ ప్రారంభం

బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్‌2 చిత్రం త‌ర్వాత అంత‌కుమించి వుండేలా ఎఫ్‌3 ని రూపొందిస్తున్నారు.విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 Pooja Hegde Party Song Shooting Starts In F3 Movie , Venkatesh, Varun Tej, Taman-TeluguStop.com

విశేషం ఏమంటే, స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల ‌లో ఒక‌రైన‌ పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రత్యేకమైన పార్టీ సాంగ్‌ ద్వారా ఈరోజు షూట్‌లో జాయిన్ అయింది.నేటి నుంచే ఈ పాట చిత్రీకరణ మొదలైంది.

అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వ‌ర్యంలో రూపొందిన అత్యద్భుతమైన సెట్‌లో సాంగ్‌ చిత్రీకరణ జ‌రుగుతోంది.

ఈ సాంగ్ కోసం రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అనుగుణ‌మైన‌, ఆక‌ర్ష‌ణీయ‌మైన ట్యూన్‌ను రూపొందించారు.

ఈ పార్టీ సాంగ్‌లో విశేషమేమిటంటే, పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణం అయిన వెంకటేష్, వరుణ్ తేజ్‌, హీరోయిన్లు కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.పూజా హెగ్డే స్పెషల్ డ్యాన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.వీళ్లందరినీ కలిసి స్క్రీన్‌ పై చూడడం నిజంగా పండగే.ఎఫ్2లో న‌టించిన రాజేంద్రప్రసాద్ ఎఫ్3 లో భాగం కాగా, సునీల్ ఈ చిత్రానికి మ‌రో ఎస్సెట్‌.దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై శిరీష్ నిర్మిస్తున్నారు.సాయి శ్రీరామ్ కెమెరా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండ‌గా, ఎడిటర్ గా తమ్మిరాజు, సహ నిర్మాత గా హర్షిత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.F3 చిత్రం మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube