రాజాకి రాజయోగం ! ఆ టీడీపీ సీనియర్ కి టెన్షన్ ?

జగన్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఒకరిగా ముద్రపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. కొత్త మంత్రివర్గంలో స్థానాన్ని రాజా సంపాదించడం పై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

 Yanamala Ramakrishnudu Facing Trouble After Dadishetty Raja Gets Minister Post D-TeluguStop.com

అందుకే జగన్ కొత్త మంత్రి మండలి ఏర్పాటు తరువాత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలోనే మంత్రి వర్గం పై విమర్శలు చేశారు.జగన్ క్యాబినెట్ చాయ్ బిస్కెట్ అంటూ యనమల సెటైర్లు వేశారు.

ఇదంతా దాడిశెట్టి రాజా కు మంత్రి పదవి ఇవ్వడం పైన యనమల రియాక్ట్ అయ్యారు అని ప్రచారం నియోజకవర్గంలో నెలకొంది.యనమల రామకృష్ణుడు , ఆయన సోదరుడు కృష్ణుడు కి ప్రధాన ప్రత్యర్థి అయిన దాడిశెట్టి రాజా తుని నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు.

జగన్ కేబినెట్ లో కీలక మైన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు.అయితే రాజా మరింతగా బలపడితే నియోజకవర్గంలో తమ పట్టు మరింతగా దిగజారుతుందని యనమల సోదరులు టెన్షన్ పడుతున్నారట.

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత జరిగిన 1983 ఎన్నికల దగ్గర నుంచి 2004 ఎన్నికల వరకు తుని నుంచి గెలుస్తూనే వచ్చారు.చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవులను చేపట్టారు.2009 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు.యనమల పై ఎస్ ఆర్ వి వి కృష్ణంరాజు పోటీ చేసి గెలుపొందారు.

దీంతో 2013లో యనమలకు ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు కట్టబెట్టారు.ఇక 2014 లో జరిగిన ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల  కృష్ణుడు పోటీ చేశారు.ఆయనకు ప్రత్యర్థిగా దాడిశెట్టి రాజా పోటీ చేసి గెలుపొందారు .2019 ఎన్నికల్లో నూ దాడిశెట్టి రాజా విజయం సాధించారు.
 

Telugu Daadisetty Raja, Tune Constancy, Tune Mla Raja-Political

మంత్రిపదవి ఆయనకు దక్కడంతో రాజకీయంగా యనమల సోదరులు  మరింత గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యనమల రామకృష్ణుడు ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా విమర్శలు చేస్తూ ఉండడం,  చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఉండటం తదితర కారణాలతో ఇప్పుడు దాడిశెట్టి రాజాకి మంత్రి పదవిని జగన్ కట్టబెట్టారని, యనమల సోదరుల రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెట్టే విధంగా తునిలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే సంకేతాలు యనమల సోదరులను మరింత టెన్షన్ పెడుతున్నయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube